Telangana Jagruti : తాను బీఆర్ఎస్ లోకి మళ్ళీ వెళ్ళేది లేదని, ఘర్ వాపసీ ఉండబోదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని కవిత ప్రకటించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని, ప్రజలు వదిలిన బాణం అని ఆమె పేర్కొన్నారు. తనను ఆపరేట్ చేసే అంత సీన్ ఎవరికీ లేదన్నారు. 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. బీఆర్ఎస్ లోకి వెళ్ళేది లేదని తేల్చేసిన కవిత యాదాద్రి భువనగిరిలోని వివేరా హోటల్లో 'జనం బాట' కార్యక్రమంలో భాగంగా విలేకరుల సమావేశంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మళ్ళీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా పార్టీలోకి రావాలని పిలిచినా వెళ్ళేది లేదన్నారు. కారణం చెప్పకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆమె మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పు ఏమిటో చెప్పకుండా తనను సస్పెండ్ చేసి బయటకు గెంటేశారు అన్నారు.
ఇప్పటివరకు 16 జిల్లాలను పర్యటించి ప్రజా సమస్యలను అధ్యయనం చేస్తూ, వాటిపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తున్నానని కవిత తెలిపారు. ఉమ్మడి యాదాద్రి జిల్లాకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని ఆమె విమర్శించారు. పెద్దల భూములు కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ కోసం పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని కవిత మండిపడ్డారు. రీజినల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతుల కోసం పోరాటం చేస్తానని స్పష్టం రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు నిర్వాసిత రైతుల సమస్యలపై రైతుల పక్షాన తాను పోరాటం చేస్తానని అన్నారు.
ట్రిపుల్ ఆర్ రైతులకు అండగా ఉండి, సమస్యలు పరిష్కరించేందుకు అందరం కలిసి ఉద్యమిద్దాం' అని కవిత పిలుపునిచ్చారు. జనవరి 4న 8 జిల్లాల నిర్వాసిత రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఆసుపత్రుల్లో వైద్య సేవలు, చికిత్స నాణ్యతపై కూడా అధికారులను ప్రశ్నించి కవిత సమాచారం సేకరించారు.
రాయిగిరి, తిమ్మాపురం, బస్వాపూర్ వంటి ప్రాంతాల రైతులతో కలిసి మాట్లాడిన కవిత, ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో చిన్న రిజర్వాయర్‌ను పెద్దదిగా మార్చి రైతుల భూములు లాగేసుకున్నారని ఆరోపించారు. కొన్నిచోట్ల మూడుసార్లు మారిన ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌లను అంగీకరించబోమని ఆమె కరాఖండిగా చెప్పారు. ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జిల్లాలో పెండింగులో ఉన్న ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ.. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేద విద్యార్థులకు వెంటనే బోధనా రుసుములు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.
Telangana Jagruti : 2029 ఎన్నికల్లో స్వతంత్రంగానే బరిలో దిగుతాం..కవిత సంచలన వ్యాఖ్యలు
తాను బీఆర్ఎస్ లోకి మళ్ళీ వెళ్ళేది లేదని, ఘర్ వాపసీ ఉండబోదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తానని కవిత ప్రకటించారు. తాను ఎవరూ వదిలిన బాణం కాదని, ప్రజలు వదిలిన బాణం అని ఆమె పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha