TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!

ఉమెన్స్ డే సందర్భంగా మహిళలపై తెలంగాణ సీఎం రేవంత్ వరాల జల్లు కురిపించారు. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రారంభించారు. ఇందిర‌మ్మ శ‌క్తి, ఎన్టీఆర్ యుక్తి స్ఫూర్తితో మ‌హిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. 

New Update
tg cm rvt

CM Revanth Good news for Telangana women

TG News: ఉమెన్స్ డే సందర్భంగా మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు కురిపించారు. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటించారు. ఇందిర‌మ్మ శ‌క్తి, ఎన్టీఆర్ యుక్తిని స్ఫూర్తితో ప్రతి మండ‌ల కేంద్రంలో మ‌హిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. 

ఆ బాధ్యత‌ మ‌హిళా సంఘాల‌కే..

ఈ మేరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఇందిరా మ‌హిళా శ‌క్తి ఆధ్వర్యంలో శ‌నివారం రాత్రి నిర్వహించిన స‌భ‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఐకేపీ కేంద్రాల్లో మ‌హిళా సంఘాల కొనుగోలు చేసే వ‌డ్లను ఆ గోదాముల్లో నిల్వ చేయ‌డంతో పాటు మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐకి స‌ర‌ఫ‌రా చేసే బాధ్యత‌ను మ‌హిళా సంఘాల‌కే అప్పచెబుతామ‌ని చెప్పారు. ఐకేపీ కేంద్రాల నుంచి వ‌డ్లు తీసుకుంటున్న కొంద‌రు మిల్లర్లు పందికొక్కుల్లా వాటిని కాజేస్తున్నార‌ని, వాటిని తిరిగి ఇవ్వడం లేద‌ని, లెక్కలు చెప్పడం లేద‌ని మండిపడ్డారు. 

Also Read: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక‌ వ్యవ‌స్థగా..

ఈ నేప‌థ్యంలో ప్రతి మండ‌లంలో రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణం మ‌హిళా సంఘాలు చేప‌ట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంద‌ని, ప్రభుత్వమే స్థలం ఇవ్వడంతో పాటు రైస్ మిల్లులు, గోదాముల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన రుణాలు ఇప్పిస్తుంద‌ని తెలిపారు. మ‌హిళా సంఘాలు త‌మ‌పై కాళ్ల నిల‌బ‌డినప్పుడే తెలంగాణ రాష్ట్రం 1ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక‌ వ్యవ‌స్థగా నిలుస్తుంద‌ని చెప్పారు. రాష్ట్రంలోని రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ కాలేజీల్లో విద్యార్థుల‌కు పౌష్టికాహారం మ‌హిళా సంఘాల నుంచి స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిర్ణయించామ‌ని తెలిపారు. ఇందుకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించాల‌ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి, సెర్ప్ సీఈవోను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

Also read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!

తెలంగాణ‌లో మ‌హిళా సంఘాల‌కు, ఆడ బిడ్డల‌కు చంద్ర గ్రహ‌ణం తొలిగింద‌ని, స్వయం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు మండ‌ల కేంద్రాల‌కు వెళ్లే అవ‌కాశం లేకుండా నాడు చేశార‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. ఆడ బిడ్డలు నిర్ణయం తీసుకొని ఇందిర‌మ్మ రాజ్యం రావాల‌ని ఆశీర్వదించ‌డంతో 15 నెల‌ల కిత్రం ప్రజా ప్రభుత్వం ఏర్పడింద‌ని అన్నారు.  ఇప్పుడు ఆడ బిడ్డలు త‌లెత్తుకొని వెలుగు, స్వేచ్చను చూస్తున్నారన్నారు. ప‌దేళ్ల నాటి పాల‌న‌ను ఏడాది త‌మ పాల‌న‌ను మ‌హిళ‌లు స్వయంగా చూస్తున్నార‌ని సీఎం తెలిపారు. మంత్రులు, అధికారుల‌ను స‌మ‌న్వయం చేసి సంఘాల‌ను బ‌లోపేతం చేయాల‌ని తాము నిర్ణయించామ‌ని, సంఘాలు బ‌లోపేత‌మైన‌ప్పుడే తెలంగాణ 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్యవ‌స్థగా నిలుస్తుంద‌ని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 

సోలార్ విద్యుత్ ఆర్టీసీ బ‌స్సులు..
ఐకేపీ సెంట‌ర్లు నిర్వహించే మ‌హిళ‌ల‌కు గ‌తంలో డ‌బ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియ‌ద‌ని, తాము వెంట‌నే చెల్లిస్తున్నామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాల‌ల నిర్వహ‌ణ‌ను సంఘాల‌కే అప్పగించామ‌ని, గ‌తంలో జ‌త బ‌ట్ట‌లు కుడితే రూ.25 ఇస్తే తాము దానిని రూ.75కు పెంచామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మ‌హిళా శ‌క్తి సమావేశాలకు భ‌వ‌నాలు ఉండాల‌ని నిర్ణయించి ప్రతి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శ‌క్తి సంఘం భ‌వ‌నానికి అనుమ‌తించి ప్రతి భ‌వ‌నానికి రూ.25 కోట్లు కేటాయించిన విష‌యాన్ని సీఎం గుర్తు చేశారు. అదానీ, అంబానీలు మాత్రమే నిర్వహించే సోలార్ విద్యుత్ ప్లాంట్లను మ‌హిళా సంఘాల చెంత‌కు చేర్చామ‌ని సీఎం అన్నారు. మ‌హిళా సంఘాలు 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు నిర్వహించి విద్యుత్ శాఖ‌కు అమ్మేలా చేశామ‌న్నారు. సోలార్ విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామంటే అందుకు త‌మ‌కు ఆడ బిడ్డల‌పై త‌మ‌కు ఉన్న న‌మ్మక‌మే  కార‌ణ‌మ‌న్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు