BIG BREAKING: కవితపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్‌లో హరీశ్‌ రావు, సంతోష్ రావును కవిత టార్గెట్‌ చేయడం దుమారం రేపింది. ఆమె వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కొందరు ఆరోపించారు. దీనిపై స్పందించిన రేవంత్ ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.

New Update

ఎమ్మెల్సీ కవిత బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్‌లో హరీశ్‌ రావు, సంతోష్ రావును కవిత టార్గెట్‌ చేయడం దుమారం రేపింది. ఆమె వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని కొందరు, బీజీపీ ఉందని మరికొందరు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. 

Also Read:  నాడు కేసీఆర్.. నేడు కవిత.. 24 ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్!

'' వాళ్ల కుటుంబ సభ్యులే కత్తులతో పొడుచుకొని హరీశ్‌ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ ఉన్నారని ఒకన్నారు. మరొకరు కవిత వెనుక రేవంత్ ఉన్నారన్నారు. మీరెలాంటి వాళ్లో తెలిసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడిస్తే మీ వెనకాల ఎవరైనా బుద్ధున్నవారు ఉంటారా ? . నేను తెలంగాణ ప్రజల వెనుక ఉంటాను. అలాంటి పనికిమాలినవాళ్ల వెనుక కాదు. దయచేసి మమ్మల్ని మీ కుటుంబ పంచాయతిలోకి లాగకండి. మాకు ఎలాంటి ఆసక్తి లేదు. మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. బీఆర్ఎస్‌ కాలగర్భంలో కలిసిపోతుంది.

Also read: సంతోష్ రావు ధన దాహం ఎలాంటిదంటే?: కవిత సంచలన ఆరోపణలు!

ఒకప్పుడు జనతా పార్టీకి కూడా గొప్ప పేరు ఉండేది. ఆ పార్టీ కనుమరుగైంది. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ చాలామందికి అవకాశాలు కల్పించింది. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా తెలంగాణలో సమస్యలను ఎదుర్కొంటోంది. మరి ఇలాంటి దుర్మార్గాలు చేసిన మీరు(బీఆర్‌ఎస్‌ను ఉద్దేశిస్తూ) ఎలా మనుగడ సాగిస్తారంటూ'' సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. 

Advertisment
తాజా కథనాలు