Kalvakuntla Kavitha: పాలమూరు- రంగారెడ్డి లో ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని, కొంచెం పనులు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ కు వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనంబాటలో భాగంగా కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగా పాలమూరు- రంగారెడ్డిని పరుగులు పెట్టించలేక పోయారని, ఫలితంగా మనం 90 టీఎంసీ ల నీటి వాటాపై హక్కు పొందలేకపోయామన్నారు.వరద నీళ్లు ఆపుకుంటా మంటూ ఏపీ నల్లమల్ల సాగర్ కడుతోంది. దాని ద్వారా మనకు అన్యాయం జరుగుతుంది. ఏపీ కడుతున్నట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టాలి. పాలమూరు- రంగారెడ్డికి నీటి సోర్స్ ను శ్రీశైలం నుంచి తీసుకోవటమంటే శాశ్వతంగా జలవివాదానికి తెరలేపినట్లేనని కవిత అన్నారు.
వట్టెం రిజర్వాయర్ లో నల్లమట్టి కోసం తీసుకున్న 9 వందల ఎకరాలు కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఆ భూములను రైతులకు ఇప్పించాలన్నారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై జాగృతి కోర్టుకు వెళ్లింది? బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ఏలూరు పంప్ హౌస్ విషయంలో హరీష్ రావు అవినీతి చేశారని కవిత ఆరోపించారు.జాగృతి జనం బాటలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాకు వచ్చాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నాం. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై పోరాటాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
ఇక నాగర్ కర్నూల్ గురించి మాట్లాడితే 1904 నుంచి కూడా ఇక్కడ రైలు కూత వినబడలేదు. గద్వాల- మాచర్ల రైల్ లైన్ ను ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇక్కడి ఎంపీ గారు ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయించే బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నాగర్ కర్నూల్ కు రైలు రాకపోవటం దారుణం అన్నారు. ఇక్కడ రైలు మార్గం వస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. నాగర్ కర్నూల్ లోని నాలుగు నియోజకవర్గాల్లో 36 శాతం అటవీ భూములే ఉన్నాయ న్నారు. ఎన్నో వనరులు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉంది. డిబీర్స్ అనే సంస్థ 14 ఏళ్ల క్రితం ఇక్కడ మైనింగ్ చేస్తామంటే దాన్ని అడ్డుకున్నాం. సాంబశివుడు అన్న గారు నేను కలిసి ఇక్కడ మైనింగ్ చేయకుండా ఆపగలిగామని తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా కృష్ణా జలాల్లో ఈ జిల్లాకు అన్యాయమే జరిగింది. అసలు నీళ్లల్లో నిప్పు రవ్వలు రగిలిందే మన నీటి వాటా కోసం. కృష్ణా నది మహబూబ్ నగర్ జిల్లాలో 308 కిలోమీటర్లు పారుతుంది. కానీ ఎన్నడూ కూడా మనం ఉన్నటువంటి నీటిని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాం. అన్ని లెక్కలు వేసి మనం 299 టీఎంసీలు వాడుకునే పరిస్థితి ఉందన్నారు. కానీ వాటిని కూడా పూర్తిగా వాడుకోలేదు. కృష్ణాలో మనకు 550 టీఎంసీలు రావాలి. వాటిని కృష్ణా పరివాహాక ప్రాంతంలో వాడుకునే ఆస్కారం ఉంటుంది. ఏదైతే 45, 45 టీఎంసీలు ఎక్సెస్ గా ఉందో 90 టీఎంసీల కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. కానీ కాళేశ్వరం పరుగులు పెట్టినట్లు పాలమూరు-రంగారెడ్డి పరుగులు పెట్టి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉంటుండే. వట్టెం రిజర్వాయర్ కు సంబంధించి కాల్వలు, దాని వ్యవస్థ ఎక్కడ పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ మహబూబ్ నగర్ లో 25 లక్షల ఎకరాలు పంటలు పండే భూములే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో కేవలం ఆరున్నర లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని కవిత ఆరోపించారు.
ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు నార్లపూర్ పంప్ హౌస్ స్టార్ట్ చేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అంటారు. కానీ ఆయనది డైవర్షన్, కరెప్షన్ విధానం.అని ఆరోపించారు. ఆయన పాలమూరు - రంగారెడ్డికి రూ.400 కోట్లు ఇచ్చిన అని చెబుతున్నారు. మరి అంత డబ్బులు ఇస్తే ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు ఎత్తిపోయలేదు. నారాయణ పేట్ - కొడంగల్ కోసం మేఘా సంస్థ, పొంగులేటి సంస్థలకు వెయ్యి కోట్ల చొప్పున అడ్వాన్స్ లు ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో అడ్వాన్స్ గా ఇచ్చే సంస్కృతి లేకుండే. కానీ ఈ ముఖ్యమంత్రి అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డిలో కొంచెం పనిచేస్తే పూర్తి అయ్యే దానికి మీరు డబ్బులు ఇవ్వలేదని కవిత ఆరోపించారు.
Kalvakuntla Kavitha: పాలమూరు- రంగారెడ్డి లో ముఖ్యమంత్రి అవినీతి..జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు
పాలమూరు- రంగారెడ్డి లో ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని, కొంచెం పనులు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ కు వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జనంబాటలో భాగంగా కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు.
Kalvakuntla Kavitha
Kalvakuntla Kavitha: పాలమూరు- రంగారెడ్డి లో ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని, కొంచెం పనులు చేస్తే పూర్తయ్యే ప్రాజెక్ట్ కు వేల కోట్ల ఖర్చు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనంబాటలో భాగంగా కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మాదిరిగా పాలమూరు- రంగారెడ్డిని పరుగులు పెట్టించలేక పోయారని, ఫలితంగా మనం 90 టీఎంసీ ల నీటి వాటాపై హక్కు పొందలేకపోయామన్నారు.వరద నీళ్లు ఆపుకుంటా మంటూ ఏపీ నల్లమల్ల సాగర్ కడుతోంది. దాని ద్వారా మనకు అన్యాయం జరుగుతుంది. ఏపీ కడుతున్నట్లే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ కట్టాలి. పాలమూరు- రంగారెడ్డికి నీటి సోర్స్ ను శ్రీశైలం నుంచి తీసుకోవటమంటే శాశ్వతంగా జలవివాదానికి తెరలేపినట్లేనని కవిత అన్నారు.
Also Read: 'రాజా సాబ్' గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో ఇంట్రెస్టింగ్ సర్‌ప్రైజ్ రెడీ..?
వట్టెం రిజర్వాయర్ లో నల్లమట్టి కోసం తీసుకున్న 9 వందల ఎకరాలు కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ఆ భూములను రైతులకు ఇప్పించాలన్నారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై జాగృతి కోర్టుకు వెళ్లింది? బీఆర్ఎస్ ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్లలేదు? ఏలూరు పంప్ హౌస్ విషయంలో హరీష్ రావు అవినీతి చేశారని కవిత ఆరోపించారు.జాగృతి జనం బాటలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాకు వచ్చాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు తిరుగుతూ క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతున్నాం. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై పోరాటాలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.
Also Read: పాకిస్థాన్‌ను వీడని ఆపరేషన్ సిందూర్ భయం
ఇక నాగర్ కర్నూల్ గురించి మాట్లాడితే 1904 నుంచి కూడా ఇక్కడ రైలు కూత వినబడలేదు. గద్వాల- మాచర్ల రైల్ లైన్ ను ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇక్కడి ఎంపీ గారు ఆ ప్రాజెక్ట్ ను పూర్తి చేయించే బాధ్యత తీసుకోవాలి. తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత కూడా నాగర్ కర్నూల్ కు రైలు రాకపోవటం దారుణం అన్నారు. ఇక్కడ రైలు మార్గం వస్తే ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. నాగర్ కర్నూల్ లోని నాలుగు నియోజకవర్గాల్లో 36 శాతం అటవీ భూములే ఉన్నాయ న్నారు. ఎన్నో వనరులు ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సి ఉంది. డిబీర్స్ అనే సంస్థ 14 ఏళ్ల క్రితం ఇక్కడ మైనింగ్ చేస్తామంటే దాన్ని అడ్డుకున్నాం. సాంబశివుడు అన్న గారు నేను కలిసి ఇక్కడ మైనింగ్ చేయకుండా ఆపగలిగామని తెలిపారు.
Also Read: నాపై కుట్ర జరుగుతోంది...మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ
తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా కృష్ణా జలాల్లో ఈ జిల్లాకు అన్యాయమే జరిగింది. అసలు నీళ్లల్లో నిప్పు రవ్వలు రగిలిందే మన నీటి వాటా కోసం. కృష్ణా నది మహబూబ్ నగర్ జిల్లాలో 308 కిలోమీటర్లు పారుతుంది. కానీ ఎన్నడూ కూడా మనం ఉన్నటువంటి నీటిని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాం. అన్ని లెక్కలు వేసి మనం 299 టీఎంసీలు వాడుకునే పరిస్థితి ఉందన్నారు. కానీ వాటిని కూడా పూర్తిగా వాడుకోలేదు. కృష్ణాలో మనకు 550 టీఎంసీలు రావాలి. వాటిని కృష్ణా పరివాహాక ప్రాంతంలో వాడుకునే ఆస్కారం ఉంటుంది. ఏదైతే 45, 45 టీఎంసీలు ఎక్సెస్ గా ఉందో 90 టీఎంసీల కోసం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. కానీ కాళేశ్వరం పరుగులు పెట్టినట్లు పాలమూరు-రంగారెడ్డి పరుగులు పెట్టి ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉంటుండే. వట్టెం రిజర్వాయర్ కు సంబంధించి కాల్వలు, దాని వ్యవస్థ ఎక్కడ పూర్తి కాలేదు. తెలంగాణ వచ్చాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 6 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ మహబూబ్ నగర్ లో 25 లక్షల ఎకరాలు పంటలు పండే భూములే ఉన్నాయి. తెలంగాణ వచ్చిన 12 ఏళ్లలో కేవలం ఆరున్నర లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారని కవిత ఆరోపించారు.
Also Read: సికింద్రాబాద్‌లో ‘స్మార్ట్’ సౌకర్యాలు..ఇక మీదట వర్క్ ఫ్రం రైల్వే స్టేషన్