Hyderabad: కేపీహెచ్‌బీలో రెచ్చిపోయిన దొంగలు...ఇంట్లోకి చొరబడి

కేపీహెచ్ బీ లో ఓ ఇంటి ముందు ఓ మహిళ ముగ్గు వేసుకుంటుంది. ముసుగు ధరించిన ఓ కుర్రోడు.. మంచి నీళ్లు కావాలంటూ ఆ మహిళను అడిగాడు. మంచినీళ్ల కోసం ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెనక ఆ చైన్ స్నాచర్ కూడా వెళ్లి మెడలోని గొలుసు లాక్కొని పారిపోయాడు.

New Update
thief

హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు లక్షల మంది జనంతో.. నిత్యం రద్దీగా ఉండే ఏరియా. అందులోనూ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు టెంపుల్ ఏరియా అంటే.. 24 గంటలూ జనం అటు ఇటు కదులుతూనే ఉంటారు. అలాంటి ఏరియాలో.. ఓ చైన్ స్నాచర్ దర్జాగా ఇంట్లోకి వచ్చి మరీ.. మెడలోని బంగారం గొలుసు లాక్కుని వెళ్లటం ఇప్పుడు తీవ్ర సంచలనంగా  మారింది. 

Also Read:  Dalailama: భారత్‌లోనే దలైలామా పునర్జన్మ?.. వారసుడిపై బౌద్ధగురువు కీలక ప్రకటన

మార్చి 12వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో.. కేపీహెచ్ బీ టెంపుల్ బస్టాప్ సమీపంలోని ఓ ఇంటి ముందు.. ఓ మహిళ ముగ్గు వేసుకుంటుంది. ముసుగు ధరించిన ఓ కుర్రోడు.. మంచి నీళ్లు కావాలంటూ ఆ మహిళను అడిగాడు. మంచినీళ్ల కోసం ఆ మహిళ ఇంట్లోకి వెళ్లగానే.. ఆమె వెనక ఆ చైన్ స్నాచర్ కూడా ఇంట్లోకి వెళ్లాడు.

Also Read:  Ap Weather:ఏపీలో ఎండలు,వేడిగాలులు...ఈ జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు!

ఆ మహిళ ఇంట్లోకి పెళ్లిన వెంటనే.. వెనక నుంచి మెడలోని బంగారం మంగళసూత్రం లాక్కుని బయటకు పరిగెత్తాడు. షాక్ అయిన మహిళ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లో నుంచి వీధిలోకి పరుగులు తీసింది. అప్పటికే ఆ కిలాడీ చైన్ స్నాచర్ అక్కడికి వేగంగా పరిగెత్తుకుని వెళ్లిపోయాడు. 

పొద్దుపొద్దునే జరిగిన ఈ ఘటనతో కేపీహెచ్ బీ కాలనీ ఉలిక్కి పడింది. చైన్ స్నాచర్లకు ఇంతకు బరితెగించారా అంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. ఈ ఘటన అంతా ఆ ఇంట్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. 

Also Read:  Actress Ranya Rao:గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్...రన్యారావు వెనుక ప్రముఖులు., పెళ్లి వీడియో పై సీబీఐ కన్ను!

Also Read: రెచ్చిపోయిన పోలీసులు.. రచ్చ చేశారంటూ యువతకు గుండ్లు కొట్టించి ఊరేగింపు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు