BIG BREAKING: హైదరాబాద్‌లో సీబీఐ డెరెక్టర్.. కాళేశ్వరంపై విచారణ ప్రారంభం !

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సీబీఐ డైరెక్టర్ ప్రవీద్‌ సూద్‌ హైదరాబాద్‌కు వచ్చారు.

New Update
Kaleshwaram Project and CBI

Kaleshwaram Project and CBI

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తున్నామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా సీబీఐ డైరెక్టర్ ప్రవీద్‌ సూద్‌ హైదరాబాద్‌కు వచ్చారు. కోఠీ సీబీఐ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వ్యవహారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లినట్లే. ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సెప్టెంబర్ 1న సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర హోంశాఖకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా పంపించారు. అయితే తాజాగా ప్రవీణ్‌ సూద్‌ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: తెలంగాణలో విషాదం.. ఆమెకు 15, అతడికి 38 ఏళ్లు.. భద్రాచలం లాడ్జిలో ఏం చేశారంటే?

కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పంపిన లేఖలో NDSA రిపోర్ట్ ఆధారంగా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికపై CBI విచారణ జరపాలని కోరింది. కాళేశ్వరం కార్పొరేషన్, అంతరాష్ట్ర అంశాలపై విచారణ జరిపించాలని ప్రతిపాదన చేసింది. కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని, ప్రాజెక్టుల డిజైన్, నాణ్యత, ఇతర లోపాల వల్లే నిర్మాణంలో వైఫల్యాలు వచ్చాయని NDSA నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రజాప్రతినిధులతో సహా కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేటు కంపెనీలపై కూడా విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.   

Also Read: వారికి పాజిటివ్ ఆటిట్యూడ్ లేదు..హరీష్‌ రావు సంచలన కామెంట్స్‌

అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపిన జస్టిస్ చంద్రఘోష్ నివేదిక ఆధారంగా పిటిషనర్ల(కేసీఆర్, హరీశ్‌రావు) చర్యలు చేపట్టవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. జస్టిస్‌ ఘోష్ రిపోర్ట్‌ను సీబీఐకి అప్పగించొద్దని పేర్కొంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NSDA), ఇతర నివేదికలపై ఆధారపడొచ్చని స్పష్టం చేసింది. 

ప్రవీణ్ సూద్ ఎవరు ?

సీబీఐ డైరెక్టర్ అయిన ప్రవీణ్ సూద్‌ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన కర్ణాటక డైరెక్టర్ జనరల్, ఇన్‌స్పెక్టర్ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2023 మే 25న సీబీఐకి కొత్త డైరెక్టర్‌గా నియామకం అయ్యారు. మరో రెండేళ్ల పాటు ఆయనే ఈ పదవిలో కొనసాగనున్నారు. అయితే ప్రవీణ్ సూద్‌ 1999లో మారిషస్ ప్రభుత్వానికి కూడా పోలీసు సలహాదారుగా ముడేళ్ల పాటు అక్కడ విధులు నిర్వహించారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చారు. మైసూర్ పోలీస్ కమిషనర్, బెంగళూరు కమిషనర్ ఆఫ్‌ పోలీస్‌తో పాటు తదితర బాధ్యతలు చేపట్టారు. 

Also Read: పిల్లలు తినే చాకెట్ల పైనా పన్ను..జీఎస్టీ మార్పుల తర్వాత కాంగ్రెస్ పై మోదీ విమర్శ..

Advertisment
తాజా కథనాలు