/rtv/media/media_files/2025/07/30/case-against-ketion-industries-2025-07-30-21-43-16.jpg)
Case against Ketion Industries
Keshan Industries : కేషన్ ఇండస్ట్రీస్ జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని విలువ 100 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలుస్తోంది. జీఎస్టీ (GST) చెల్లింపుల్లో మరో భారీ మోసం జరిగినట్లు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ లోని కేషన్ ఇండస్ట్రీస్ తుప్రాన్‌లో పరిశ్రమ కలిగి ఉండి రాగి వస్తువులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ రాగి నీటి సీసాలు, రాగి మగ్గులు, రాగి పూజా లొటా, రాగి పాత్రలు, బస్సుబార్లు, వైర్లు, కడ్డీలు, షీట్లు, ప్లేట్లు మొదలైనవి తయారు చేస్తోంది. ముఖ్యంగా రాగి వస్తువులు, రాగి పూజ సామాగ్రి, రాగి పాత్రలు,ఇతర రాగి ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇవ్వే కాక , బస్సుబార్లు, వైర్లు, కడ్డీలు, షీట్లు, ప్లేట్లు వంటి రాగి ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు.
Also Read : రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!
కాగా ఈ సంస్థ తయారు చేసిన వస్తువులను ఇండియా మార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఈ సంస్థను 2016లో వికాష్ కుమార్ కేషన్, రజనీశ్ కుమార్ కేషన్ స్థాపించారు. అయితే గత కొంతకాలంగా ఈ సంస్థ జీఎస్టీ చెల్లించకుండా అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో, తాజాగా కేషన్ ఇండస్ట్రీస్ గోదాములపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఈ రోజు దాడులు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో సదరు సంస్థ రూ.100 కోట్లకు పైగా జీఎస్టీ మోసానికి పాల్పడినట్లుగా గుర్తించారు.
కాపర్ వస్తువులు ఇతర రాష్ట్రాలకు తరలించకుండానే తరలించినట్లు నకిలీ వే బిల్లులను సంస్థ సృష్టించినట్లు తేలింది. అదేవిధంగా ఖాళీ వాహనాలను తెలంగాణ ,మహారాష్ట్ర మధ్యల తిప్పుతూ ఆ డాక్యుమెంట్లతో భారీగా సరుకుల రవాణా చేసినట్లు చూపించారు. నకిలీ వే బిల్లులతో రూ.33.20 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కేషన్ ఇండస్ట్రీస్ పొందినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారుల తనిఖీల్లో తెలిసింది వాణిజ్య పన్నుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఆ సంస్థ డైరెక్టర్లు వికాశ్ కుమార్ కేషన్, రజనీష్ కుమార్ కేషన్‌పై సీసీఎస్‌లో కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి:TG New Ration Cards: కొత్త రేషన్‌కార్డుదారులకు అదిరిపోయే శుభవార్త.. ఆ స్కీమ్స్ కూడా.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!