/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
KTR
KTR : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఒక చెక్ డ్యామ్ నిర్మించడం చేతకాదు కానీ, కాళేశ్వరంపై బురదజల్లే పనులు చేస్తారా అంటూ విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ రెండు నెలల్లో ఎందుకు కొట్టుకుపోయిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
SLBC టన్నెల్ తొవ్వడం చేతకాదు..
— KTR (@KTRBRS) August 19, 2025
సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు..
చివరికి ఓ చెక్ డ్యామ్ ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు..
మహబూబ్ నగర్ లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్… pic.twitter.com/jD5fctDGM6
కాంగ్రెస్ సర్కార్‌కు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ తవ్వడం చేతకాదు.. సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివి లేదని విమర్శించారు... చివరికి ఓ చెక్ డ్యూమ్ కూడా నిర్మించలేని కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టుపై మాత్రం బురద జల్లుతారని, ఇది సిగ్గుచేటు అంటూ తీవ్రంగా విమర్శించారు. గుడిబండ చెక్ డ్యామ్ నిర్మాణంలో నాసిరకం పనులు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయేందుకు కారణమైన ప్రతి ఒక్కరిపై సర్కారు చర్యలు తీసుకొని బాధితులను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చెక్‌డ్యామ్ నాసిరకం పనులతో రైతుల పొలాలు, మోటర్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్‌ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైందని ఆరోపించారు. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని దద్దమ్మ ప్రభుత్వం అని.. కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ పోస్ట్ ఏముందంటే...
‘SLBC టన్నెల్ తొవ్వడం చేతకాదు.. సుంకిశాల రిటైనింగ్ వాల్ సరిగ్గా కట్టించే తెలివిలేదు.. చివరికి ఓ చెక్ డ్యామ్ ను కూడా నిర్మించలేని కాంగ్రెస్ సన్నాసులు కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లడం సిగ్గుచేటు.. మహబూబ్‌నగర్ లోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్ద వాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్ డ్యామ్ రెండునెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలి. నాసిరకం పనులు చేసి రైతుల పొలాలు, మోటర్ పైప్ లైన్లు, చివరికి ట్రాన్స్‌ఫార్మర్ కూడా కొట్టుకుపోయే దుస్థితికి కారణమైన ప్రతి ఒక్కరిపై సర్కారు చర్య తీసుకుని బాధితులను ఆదుకోవాలి. ప్రాజెక్టుల మాట దేవుడెరుగు చివరికి ఒక్క ఇటుక కూడా సరిగా పేర్చలేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాసి మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టుపై నోరు పారేసుకోమని లెంపలేసుకోవాలి.’ అని ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు.
Also Read: 'నా భార్య బాధపడింది'.. వారానికి 90 గంటల పనిపై వెనక్కి తగ్గిన L&T సీఎండీ