Crime News: మరికొద్దిరోజుల్లో పెళ్లి..ఇంతలోనే..దారుణం
పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు కరెంట్ కాటుకు బలయ్యాడు. కొద్దిరోజుల్లో పల్లకి ఎక్కి ఊరేగాల్సిన యువకుడు మృత్యువాత పడి పాడె ఎక్కడంతో దేవరకద్ర మండలం చిన్న రాజమూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. యువకుని ఇటీవలె పెళ్లి నిశ్చయం కావడం గమనార్హం.