Sunksihala Project: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్‌పై బదిలీ వేటు వేసింది. మరికొందరు అధికారులను సస్పెండ్ చేసింది. నిర్మాణ సంస్థ అయిన మేఘా కంపెనీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.