గ్రూప్‌-2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు !

గ్రూప్‌-2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థికి గుండెపోటు రావడం కలకలం రేపింది. వెంటనే స్పందించిన ఎస్సై అతడిని ఆస్పత్రికి తరలించంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో చోటుచేసుకుంది.

New Update
group 2

ఆదివారం, సోమవారం జరిగిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే గ్రూప్‌-2 పరీక్ష రాస్తుండగా ఓ అభ్యర్థికి గుండెపోటు రావడం కలకలం రేపింది. వెంటనే స్పందించిన ఎస్సై అతడిని ఆస్పత్రికి తరలించంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరులో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ గ్రామం లక్ష్మీనగర్‌కు  చెందిన ఎల్‌.నగేశ్‌.. పటాన్‌చెరు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో గ్రూప్‌-2 పరీక్షకు హాజరయ్యారు.  

Also Read: నెహ్రూ లేఖల దుమారం..మోదీ పై మండిపడ్డ ఖర్గే

నగేశ్ నాలుగో పేపర్‌ రాస్తుండగా.. మరో అరగంటలో పరీక్ష ముగుస్తుందనగా ఒక్కసారిగా అతడికి గుండెపోటు వచ్చింది. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు 108 అంబులెన్స్‌ వచ్చే సమయం లేకపోవడంతో పరీక్ష కేంద్రం వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఆసిఫ్‌ వెంటనే స్పందించారు. మూడో అంతస్తులో ఉన్న నగేశ్‌ను భూజంపై మోసుకుంటూ కిందకు తీసుకొచ్చారు. వాహనంలో ఎక్కించుకొని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  

సమయానికి నగేశ్‌ను ఆస్పత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే అతడికి మూర్చ వ్యాధి ఉందని.. గుండెపోటు కాకపోవచ్చని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉండగా నాగర్‌కర్నూల్‌ జిల్లాలో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ పురిటి నొప్పులతోనే గ్రూప్-2 పరీక్షలు రాశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే మహిళ నాగర్‌ కర్నూల్‌ పట్టణంలోని ZP ఉన్నత పాఠశాలలో గ్రూప్-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు.

Also Read: మాజీ అధ్యక్షుడు అసద్ అరాచకాలు..బందీలను పెంపుడు సింహాలకు ఆహారం

 పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ రేవతి ఇందుకు ఒప్పుకోలేదు. పరీక్ష రాస్తానని చెప్పారు. దీంతో అధికారులు జిల్లా కలెక్టర్ సంతోష్‌కు ఈ విషయం చెప్పారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం పరీక్ష కేంద్రంలో 108 అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. అలాగే ప్రత్యేక వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. ఆమెకు నొప్పులు ఎప్పుడు తీవ్రమైనా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంచారు. పట్టువదలకుండా రేవతి పరీక్ష రాశారు. ఆమె భర్త, తల్లి కూడా అక్కడే అందుబాటులో ఉన్నారు.   

Also Read: వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే.. మరోసారి బాంబు పేల్చిన నారాయణమూర్తి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు