Rajyasabha: నెహ్రూ లేఖల దుమారం..మోదీ పై మండిపడ్డ ఖర్గే

రాజ్యసభలో ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఖర్గే. ఇంకా గతంలోనే బతుకుతున్నారని విమర్​శించారు. నెహ్రూ లేఖల పేరుతో ప్రజను తప్పుదోవ పట్టంచే ప్రయత్నం చేస్తున్నారని ఖర్గే అన్నారు. 

New Update
1

లోక్‌సభలో మోదీ చేసిన ప్రసంగం పెద్ద దుమారమే లేపింది. ఆయన రాజ్యాంగం గురించి పొగుడుతూనే పనిలో పనిగా కాంగ్రెస్‌ ను తిట్టిపోశారు. దీనిపై ఈరోజు రాజ్యసభలో మళ్ళీ గొడవ రేగింది. మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత ఖర్గే. ప్రధాని మోదీ ఇంకా గతంలోనే బతుకుతున్నారని, వర్తమానంలోకి రాలేదని ఖర్గే ఎద్దేవా చేశారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రస్తుతం సాధించిన విజయాలేవైనా ఉంటే వాటి గురించి వివరించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఖర్గే సూచించారు. ఎన్నాళ్ళు నెహ్రూ లేఖల పేరుతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తారంటూ ఖర్గే మోదీపై మండిపడ్డారు. 

అసలేం చేశారో చెప్పాలి..

ప్రధాని నంబర్ 1 అబద్దాల కోరు అన్నారు ఖర్గే. ఒకొక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని నమ్మించి ఓట్లు దండుకున్నారు. కానీ ఇప్పటి వరకూ ఆ డబ్బులు ఒక్కరి ఖాతాలో కూడా పడలేదు అని విమర్శించారు. ప్రజలను తప్పు దోవ పట్టించడంలో, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ తరువాతనే ఎవరైనా అన్నారు. గత 11 ఏళ్లలో రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రధాని మంత్రి చేసిన ఒక్క పని గురించైనా చెప్పగలరా అని ఖర్గే ప్రశ్నించారు. ఏ మతంలోనైనా మోక్షం పొందడానికి భక్తి గొప్ప మార్గమని, రాజకీయాల్లో మాత్రం వ్యక్తి పూజ నియంతృత్వానికి బీజం వేస్తుందని.. డిక్టేటర్గా రూల్ చేయడానికి మోదీ సిద్ధమయ్యారని రాజ్యసభ సమావేశాల్లో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే విరుచుకుపడ్డారు. 

Also read: సోనియా గాంధీ తీసుకున్న నెహ్రూ లేఖలు అప్పగించండి: కేంద్రం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు