Beer sales increase : మండుతున్న ఎండలు..రోజు రోజుకు పెరుగుతున్న బీర్ల అమ్మకాలు

ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 కాకముందే ఎండ దంచి కొడుతుంది. ఇదిలా ఉంటే  ఎండల తీవ్రత పెరగడంతో మందుబాబులు హార్డ్ కు గుడ్ బై చెప్పి బీర్లు తాగేస్తున్నారు. దీంతో గడచిన రెండు రోజుల్లోనే బీర్ల అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.

New Update
Telangana beers

Telangana beers sales increase

Beer sales increase : ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 కాకముందే ఎండ దంచి కొడుతుంది. ఇక మధ్యాహ్నం సంగతి చెప్పనక్కరలేదు. ఇదిలా ఉంటే  ఎండల తీవ్రత పెరగడంతో మందుబాబులు హార్డ్ కు గుడ్ బై చెప్పి బీర్లవైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో గడచిన రెండు రోజుల్లోనే బీర్ల అమ్మకాల్లో గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకుంది. మార్చి 2న రోజువారికంటే 40 శాతం వరకు బీర్ల అమ్మకాలు పెరగడం గమనార్హం.. కాగా మార్చి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే మార్చి చివరి నుంచి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండలు మరింతగా దంచి కొట్ట నున్నాయి. పెరుగుతున్న ఎండలకు తోడు బీర్ల అమ్మకాలు కూడా పెరిగే అవకాశం ఉంది.

 వేసవికాలంలో మద్యం అమ్మకాల్లో బీర్లదే అగ్రస్థానం. ప్రస్తుత కాలంలో ఎండలనుంచి తట్టుకోవడానికి శీతలపానీయాల వైపు చూడడం కామన్. అయితే మద్యం ప్రియులు మాత్రం చల్లని బీర్లవైపు దృష్టి సారిస్తున్నారు.దీంతో బీర్ల అమ్మకాలు ఘననీయంగా పెరుగుతున్నాయి. 

ఫిబ్రవరి నెలలో మొత్తం రూ.3,210 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా. ఫిబ్రవరి 28వ తేదీ ఒక్క రోజే 3 లక్షల 28 వేల కేసుల బీర్లు, 2 లక్షల 85 కేసుల లిక్కర్ (హార్డ్ ) అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక పెరిగిన బీర్ల అమ్మకాలకు తగినట్లు ఉత్పత్తిని పెంచాలని బీర్ల తయారీ  కంపెనీలను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీర్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, వేసవిలో బీర్‌ల ఫ్యాక్టరీలకు నీటి సరఫరా ఆగకుండా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.   

Advertisment
తాజా కథనాలు