Mint Juice : వేసవిలో పుదీనా జ్యూస్ తాగితే ఈ సమస్యలు ఉండవు
పుదీనా నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు పుదీనా నీటిని తాగితే మెరిసే చర్మంతో పాటు శక్తి కూడా వస్తుంది. ఇది శరీరం, కడుపును చల్లగా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్, ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం నుంచి కూడా రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు.