KTR: నన్ను కాదు.. దమ్ముంటే మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయి: రేవంత్ కు కేటీఆర్ సవాల్! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తన అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డికి.. మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి దమ్ముందా? అని ప్రశ్నించారు. By Nikhil 08 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి తన అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డికి.. మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి దమ్ముందా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. మెఘా కృష్ణా రెడ్డిని అరెస్ట్ చెయ్యడానికి దమ్ముందా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి తీసివేయడానికి? దమ్ముందా అంటూ రేవంత్ కు సవాల్ విసిరారు. నా అరెస్టు కోసం ఉవ్విళ్ళూరుతున్న రేవంత్ రెడ్డి! దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని సుంకిసాల ఘటనలో బ్లాక్ లిస్ట్ చెయ్యడానికి! దమ్ముందా మెఘా కృష్ణా రెడ్డి ని అరెస్ట్ చెయ్యడానికి? దమ్ముందా ఆ ‘ఆంధ్రా కాంట్రాక్టర్’ని తన ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి… pic.twitter.com/eiFO7bbH1A — KTR (@KTRBRS) November 8, 2024 Also Read : పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. జడ్పీటీసీ టూ సీఎం.. ఆయన సక్సెస్ కు కారణం ఇదే..! రేవంత్ రెడ్డికి సెటైర్లతో విషెస్.. ఇదిలా ఉంటే.. అరెస్ట్ వార్తల నేపథ్యంలో తాను మలేషియా వెళ్లారన్న ప్రచారాన్ని సైతం కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం ట్వీట్ చేశారు. తాను ఎక్కడికీ పోలేదని.. హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. మీ ఏజెన్సీలను ఎప్పుడు పంపినా ఓకేనన్నారు. చాయ్, ఉస్మానియా బిస్కెట్లు రెడీగా ఉన్నాయన్నారు. మీ బర్త్‌డే సందర్భంగా కేక్ కట్ చేద్దామన్నా నాకు ఓకేనన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బర్త్‌డే విషెస్ చెప్తూ కేటీఆర్ సెటైర్లు వేశారు. Happy Birthday @revanth_anumula I am very much in Hyderabad. Your agencies are welcome anytime Chai, Osmania biscuits and if they want to cut your birthday cake, it’s on me 👍 https://t.co/ccPOezg1WC — KTR (@KTRBRS) November 8, 2024 Also Read : బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. కొట్టుకున్న నబీల్- పృథ్వీ..! కంటెస్టెంట్స్ షాక్ మూసీ పరివాహక ప్రాంతంలో రేవంత్ రెడ్డి పాదయాత్రపై సైతం కేటీఆర్ ట్వీట్లు చేశారు. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రీ పాలన తీరు ఉందని సెటైట్లు విసిరారు. హైదరాబాద్ లో మూసి బాధితులు ఉంటే-నల్గొండలో మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు. కూల్చిన ఇండ్లెక్కడ? కాలిన కడుపులెక్కడ? నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ? ఆగిన గుండెలెక్కడ? రగిలిన మనసులెక్కడ? నువ్వు చేసిన ఎర్ర రంగు మార్కింగ్ ఎక్కడ? నువ్ చేస్తున్న పాదయాత్ర ఎక్కడ? నీ కుట్రలకు అంబర్ పేట్ - అత్తాపూర్ అతలాకుతలం అవుతుంటే - నీ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నది ఎక్కడ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. Also Read : AP ఎస్సీ వర్గీకరణపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. నెల రోజుల్లోనే.. మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉంది గుంపు మేస్త్రీ పాలన తీరుహైదరాబాద్ లో మూసి బాధితులు ఉంటే-నల్గొండలో మూసి పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్ రెడ్డి ఆంతర్యం ఏమిటి?కూల్చిన ఇండ్లెక్కడ - కాలిన కడుపులెక్కడ -నువ్ తిరుగుతున్న ప్రాంతం ఎక్కడ ?ఆగిన… pic.twitter.com/wg1tVPXuGP — KTR (@KTRBRS) November 8, 2024 Also Read : చిన్నప్పుడు స్టార్ హీరోలకు కూడా ఆ భాదలు తప్పలేదు..! #megha-krishna-reddy #brs #ktr #revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి