BIG BREAKING: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి దూరంగా బీఆర్‌ఎస్‌..కారణం ఏంటంటే?

హరీశ్‌రావు తండ్రి మృతికి సంతాపంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్నిరద్దు చేస్తున్నట్లు కేటీఆర్ (KTR) ప్రకటించారు.

New Update
Revanth, KCR condole..

BIG BREAKING:  జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాగా సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ తన శక్తిమేర ప్రచారం ముమ్మరం చేసింది. అయితే ఈ రోజు (మంగళవారం) ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించింది. మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు ఉదయం చివరి శ్వాస విడిచారు. దీంతో హరీశ్ రావు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం తెలిసిన వెంటనే పలువురు సంతాపం తెలపడంతో పాటు బీఆర్ఎస్‌ ముఖ్యనేతలంతా ఆయన ఇంటికి క్యూకట్టారు. సత్యనారాయణ రావు పార్ధివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.  ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ (KCR), సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీ బండి సంజయ్,  తెలంగాణ జాగృతి నాయకురాలు కవిత సంతాపం తెలిపారు. కేటీఆర్‌ స్వయంగా వెళ్లి నివాళులు అర్పించడంతో పాటు అంత్యక్రియలు అయ్యేంతవరకు అక్కడే ఉండనున్నారు.

ఇదిలా ఉండగా బీఆర్‌ఎస్‌లో హరీశ్ రావు కీలకనేత కావడంతో పాటు కేసీఆర్‌కు మేనల్లుడు, కేటీఆర్‌కు మేనబావ. దీంతో హరీశ్‌రావు తండ్రి మృతికి సంతాపంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి మృతి నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ అధికారిక ఎక్స్‌ ఖాతాలోనూ ఈ విషయాన్ని వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు