బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ కోణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దిలీప్ గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకున్నారు.
Also Read: Hyderabad Food: ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ లాస్ట్...!
Also Read: పరువు పోతుందనే లగచర్లలో రేవంత్ కుట్ర..ఈటల సంచలన ఆరోపణలు!
అప్పటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ గా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. లగచర్ల, మూసీ ప్రాజెక్ట్ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేక ప్రచారం జరిగింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం.. ఇలాంటి పోస్టులు పెడుతున్న, పెట్టిస్తున్న వారిపై చర్యలలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: పోలీసులను చితకొట్టిన అఘోరి.. ఈడ్చుకెళ్లి DCMలో పడేసి ఏం చేశారంటే?
అరెస్టును ఖండించిన హరీశ్ రావు..
కొణతం దిలీప్ అరెస్ట్ ను మంత్రి మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలన్నారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్