/rtv/media/media_files/2025/07/30/kcr-delhi-tour-2025-07-30-19-20-56.jpg)
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రత్యక్ష పోరాటానికి ఆయన రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీసీ నాయకులతో కలిసి ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. రాష్ట్రపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపుకు ఆవశ్యకతను వివరించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం BRS నేతలు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 6న బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ధర్నా చేపట్టనుంది. ఆ తర్వాత కేసీఆర్ కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్
42% కోటా కోసం కాంగ్రెస్ సర్కార్ పై ఒత్తిడి, ప్రజల్లో చైతన్యమే లక్ష్యంగా బీసీల కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం.
— BRS Party (@BRSparty) July 30, 2025
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో భేటీలో బీసీ నేతల కార్యాచరణ.. ఉమ్మడి 10 జిల్లాల వారీగా బహిరంగ సభలు.
ఆగస్టు 8న కరీంనగర్ వేదికగా శంఖారావం పూరించనున్న బీఆర్ఎస్ 🔥 pic.twitter.com/UBDIOLKdQQ
Also Read : రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!
ఢిల్లీకి రేవంత్ టూర్..
అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఎట్టిపరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్ల పెంపు జరిగిన తర్వాతనే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని పట్టుదలతో ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు కేంద్రం సహకరించడం లేదని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కేంద్రం వైఖరిని ఎండగట్టాలని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో హస్తం నేతలు భారీ ధర్నా తలపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఆగస్టు 5న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో పాటు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రులను సీఎం బృదం కలవనుంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలనే కాకుండా ఇండియా కూటమి మద్దతును కూడా కోరాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆ కూటమి అగ్ర నేతలను కలిసి కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపుపై వివరిస్తారు. తాము తీసుకువచ్చిన బీసీ బిల్లకు మద్దతు కోరనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 6న భారీ ధర్నా చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే రాష్ట్ర రాజకీయాలు మొత్తం బీసీ బిల్లు చుట్టే తిరుగుతున్నాయి.
telugu-news | telugu breaking news | latest-telugu-news | latest telangana news