KTR Padayatra: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!

TG: కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలపరించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.

Minister KTR: 50 ఏళ్లలో చేయనివాళ్లు ఇప్పుడు చేస్తారా? నిర్ణయం ప్రజలదే అంటున్న కేటీఆర్..
New Update

MLA KTR:  కేటీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలపరించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తేదీలను త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. కాగా 2025లో కేసీఆర్ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండబోతున్నారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇచ్చారని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోవడం, నేతల ఫిరాయింపులు, పార్టీ శ్రేణుల్లో నిరాశ వంటి వాటి నుంచి నూతన ఉత్సహాన్ని తెచ్చేందుకు కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇచ్చిన హామీలు గాలికి...

అధికారంలోకి వచ్చేందుకు అమలు చేయలేని అనేక హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని అన్నారు.అధికారంలోకి వచ్చిన ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.  

Also Read:  అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత!

అధికారంలోకి వయా పాదయాత్ర...

తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు అత్యంత ప్రభావితం చూపిన విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహాప్రస్థానం పేరిట 1,470 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. ఈ పాదయాత్రతో పదేళ్ల తర్వాత 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. అనంతరం 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు సైతం 'మీకోసం' పేరుతో పాదయాత్ర చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 

Also Read:  పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. పండుగ తెల్లారే పెద్ద షాక్!

ఆ తర్వాత ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రకు వెళ్లారు. అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికలకు ముందు నారా లోకేష్ సైతం యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించి అధికారం దక్కించుకుంది. దీంతో తెలుగు రాజకీయాల్లో పాదయాత్రలు సెంటిమెంట్ గా మారాయి. దీంతో గత అసెంబ్లీ అన్నికల్లో అధికారం కోల్పోవడంతో పాటు పార్లమెంట్ ఎలక్షన్లలో సున్నా సీట్లకు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి కేటీఆర్ కూడా పాదయాత్ర ను అస్త్రంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

#ktr #kcr #telangana-news #telangana #brs-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe