BJP Mla: అనారోగ్యంతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత! కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సోదరుడు, జమ్మూ కశ్మీర్ నగ్రోటా బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆయన మృతి చెందారు. By Bhavana 01 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Bjp Mla: కేంద్ర మంత్రి జిత్రేంద్ర సింగ్ రాణా సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా (59) గురువారం రాత్రి అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. చాలా కాలం నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జితేంద్ర సింగ్ చిన్న సోదరుడైన దేవేంద్ర.. ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో నగ్రోటా స్థానం నుంచి విజయాన్ని అందుకున్నారు. జమ్మూ ప్రాంతంలోని ఆ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి జోగిందర్ సింగ్‌పై 30,472 ఓట్లతో గెలిచారు. Also Read: బీపీఎల్ గ్రూప్ ఛైర్మన్ నంబియార్ కన్నుమూత...చంద్రబాబు సంతాపం! మంచి బలమైన నేతగా... 2014 ఎన్నికల్లో ఎన్సీ అభ్యర్ధిగా ఇదే స్థానం నుంచి దేవేందర్ గెలవడం నిజంగా విశేషమే. డోగ్రా సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంచి బలమైన నేతగా గుర్తింపు ఉంది. దేవేంద్ర సింగ్‌కు భార్య, ఇద్దరు అమ్మాయిలుతో పాటు ఒక అబ్బాయి ఉన్నారు. ఎన్సీలో ఉన్నప్పుడు ప్రస్తుత జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు అత్యంత సన్నిహితుడిగా దేవేంద్ర ఉన్నారు. రెండు దశాబ్దాల పాటు ఆ పార్టీలో కొనసాగిన ఆయన చివరకు 2021లో ఎన్సీని వీడి బీజేపీ గూటికి చేరారు. Also Read: నేటి నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు! దేవేందర్‌సింగ్ మృతిపై సీఎం ఒమర్ అబ్దుల్లా, లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన అకాల మరణం తమను ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సురీందర్ కుమార్ చౌదరీ సంతాపం వ్యక్తం చేశారు. దేవేందర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ.. దేవేంద్ర సింగ్ రాణా మరణం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ఆయన కుటుంబానికి తన సంతాన తెలియజేశారు. Also Read: స్పెయిన్‌లో వరదల బీభత్సం.. 140 మంది మృతి బీజేపీ అధికార ప్రతినిధి సాజిద్ యూసఫ్ స్పందిస్తూ.. జమ్మూ కశ్మీర్‌లో రాణా ప్రముఖ రాజకీయ నాయకుడు.. ఆయన అకాల మరణం బీజేపీ, ఆయన అనుచరులను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్ అమితాబ్ మట్టో ట్వీట్ చేస్తూ.. ఆయన మరణం చాలా బాధాకరమని, ఆయన చాలా విలువైన నాయకుడని పేర్కొన్నారు. సోదరుడి మరణవార్త తెలిసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. ఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్‌కు చేరుకున్నారు. శుక్రవారం దేవేందర్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. Also Read: ఆ ఊరిలో దీపావళి వేడుకలు లేవు.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి