BIG BREAKING: 'తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేసు'

TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తక్షణమే సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

New Update

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు అయింది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని మూసీ ప్రక్షాళన పేరుతో అసభ్య పదజాలంతో దూషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ శ్రావణ్ దాసోజు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, రాష్ట్ర నాయకులు కడారి స్వామి యాదవ్, రఘురాం, రాజు తదితరుల ప్రతినిధి బృందం పిర్యాదు చేసింది. సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: Delhi Ganesh: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్

Also Read: TCS: ఆఫీసుకొస్తేనే బొనస్‌ ఇస్తానంటున్న టీసీఎస్‌!

రేవంత్ కు కేసీఆర్ కౌంటర్... 

మాజీ సీఎం కేసీఆర్ చాలా గ్యాప్ తరువాత మీడియా ముందుకు వచ్చారు. నిన్న వరంగల్ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల దాడికి దిగారు. 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆధ్వర్యంలో కేసీఆర్ ను ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌజ్ లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు కలిశారు. సినిమా ప్రొడ్యూసర్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి , సినీ ఆర్టిస్ట్  రవితేజ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Also Read: ఇంట్లో దోమలను పంపించేయాలంటే.. ఈ చిట్కా పాటించాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు