'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!

హీరో సిద్దార్థ్ 'పుష్ప2' పాట్నా ఈవెంట్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ని చూడడానికి భారీగా అభిమానులు రావడంపై సెటైర్ వేశారు. జేసీబీ తవ్వే స్థలం కూడా జనాన్ని ఆకర్షిస్తుంది. అల్లు అర్జున్‌ని చూడటానికి ప్రజలు గుమిగూడడం గొప్ప విషయమేమి కాదని అన్నారు.'

New Update

Siddharth: అల్లు అర్జున్ పుష్ప2 ఈవెంట్ పాట్నాలో నిర్వహించగా.. ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ కి సుమారు 2 లక్షలకు పైగా అభిమానులు హాజరయ్యారు. రాష్ట్రం కానీ రాష్ట్రంలో 'పుష్ప' క్రేజ్ చూసి అంతా షాక్ అయ్యారు. 

Also Read: మొత్తం బంగారమే.. శోభిత వెడ్డింగ్ చీర గురించి ఈ విషయాలు తెలుసా..?

పాట్నా ఈవెంట్ పై సిద్దార్థ వివాదాస్పద వ్యాఖ్యలు.. 

అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సిద్దార్థ్  'పాట్నా' ఈవెంట్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రోజు అల్లు అర్జున్ ని చూసేందుకు భారీగా అభిమానులు రావడంపై సెటైర్లు వేశారు. పుష్ప 2 ఈవెంట్ కి వచ్చిన అభిమానులను JCB త్రవ్వే స్థలాన్ని చూడటానికి గుమిగూడిన వ్యక్తులతో పోల్చాడు. 

సిద్దార్థ్ మాట్లాడుతూ.. "మన దేశంలో ఎక్కడైనా JCB తవ్వకాలు జరుగుతున్నాయంటే వెంటనే జనం గుమిగూడుతారు. కావున, పాట్నా ఈవెంట్ లో  అల్లు అర్జున్ ని చూడడానికి జనం గుమిగూడడం అసాధారణమైన విషయమేమి కాదు అని అన్నారు." భారతదేశంలో జనాలు అనేది కొలమానం కాదు.. అదే నిజమైతే అన్ని రాజకీయ పార్టీలు తప్పక గెలవాలి. అది కేవలం బిర్యానీ ప్యాకెట్,  క్వార్టర్ బాటిల్ కోసమే అని  అన్నారు. ఈ వ్యాఖ్యల పై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు.  నార్త్ లో సిద్ధార్థ్ గురించి ఎవరికీ తెలియదు అందుకే  అసూయతో మాట్లాడుతున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

ఇది ఇలా ఉంటే 'పుష్ప2' ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా .. తొలిరోజు నుంచి రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తోంది. తొలిరోజు రూ.294 కోట్ల వసూళ్లను సాధించి ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా చరిత్ర సృష్టించింది. నాలుగు రోజుల్లోనే రూ. 829 కోట్ల వసూళ్లు సాధించి 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. 

Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు