Pushpa 2: అల్లు అర్జున్ 'పుష్ప 2' మరో ఇంట విషాదం నింపింది. ఇటీవలే హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటనలో ఓ మహిళ మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే మరో విషాదం చోటుచేసుకుంది.
🚨ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో.
— Narendra News (@Narendra4News) December 10, 2024
తాజాగా ఏపీలో ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు.
అనంతపురం జిల్లా రాయదుర్గ్‌లోని కేబీ ప్యాలెస్ థియేటర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. #pushpa2 #Pushpa2TheRule
pic.twitter.com/yrcdBTC5Cg
Also Read: ఉర్ఫీ ఫ్యాషన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఫొటోల పై సమంత కామెంట్!
పుష్ప2 థియేటర్ లో అనుమానాస్పద ఘటన..
అనంతపురం జిల్లా రాయదుర్గంలో పుష్ప-2 సినిమా స్క్రీనింగ్ చేస్తున్న థియేటర్ లో ముద్దానప్ప అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. షో ముగిసిన తర్వాత కూడా సీట్లో అలాగే కూర్చొని ఉండడంతో.. అది గమనించిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యానికి దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడిని పరీశీలించగా మృతి చెందినట్లు గుర్తించారు. అయితే ముద్దానప్ప తొక్కిసలాట కారణంగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు చేస్తున్నారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: ఏపీ కూటమిలో యనమల చిచ్చు.. చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తూ..!
Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!