Ex CM KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈ ఏడాది మార్చి 31న ఛలో నల్గొండ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్తుంగా మార్గమధ్యలో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాకు చెందిన మహిళా రైతు ఆంగోతు సత్తమ్మ.. ఆమె వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ వెళ్లారు. ఆమెతో కాసేపు ముచ్చటించి.. ఆమె ఎదుర్కొంటున్న కష్టాలని అడిగి తెలుసుకున్నారు.
Also Read: Hydrogen Train: త్వరలో ఈ మార్గంలో నీటితో నడిచే హైడ్రోజన్ ట్రైన్!
రూ.5 లక్షల సాయం...
మాజీ సీఎం కేసీఆర్.. తన వద్దకు రావడంతో సత్తమ్మ తన కష్టాలను ఆయనతో చెప్పుకుంది. గత రబీలో తాను సాగుచేసిన వరి పంట చేతికందే సమయంలో నీళ్లు సరిపోక నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు పడలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సత్తమ్మ బోర్లు వేసిన ప్రాంతాన్ని కేసీఆర్ సందర్శించారు. త్వరలో తన కుమారుడు పెళ్లి ఉందని.. తన వద్ద ఉన్న డబ్బులన్నీ నీళ్లు పడుతాయని ఆశతో బోర్లు వేసినట్లు తెలిపారు. నాలుగు బోర్లు వేసినా.. తనను దేవుడు కరుణాచలేదని.. ఒక్క బోరులో కూడా నీళ్లు రాలేవని.. అప్పు తెచ్చి బోర్లు వేస్తే.. నీళ్లు పడక.. ఇప్పుడు అప్పు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని కేసీఆర్ ముందు కన్నీళ్లు పెట్టుకుంది.
Also Read: Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ!
ఆమె బాధను విన్న కేసీఆర్.. సత్తమ్మకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సాయం చేస్తానని అన్నారు. ఆమెకు ఆర్థిక ఇబ్బందుల నుంచి కాస్త ఉపశమనం లభించేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని తన సొంత డబ్బులో నుంచి ఇస్తానని హామీ ఇచ్చారు. తాజాగా ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు ఆ డబ్బును అందించారు కేసీఆర్. నిన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కేసీఆర్ ఇచ్చిన రూ.5 లక్షల చెక్ ను సత్తమ్మకు అందజేశారు. కేసీఆర్ మరోసారి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షల చెక్కును పంపి, రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారని ఎర్రబెల్లి అన్నారు. కాగా కేసీఆర్ చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పింది సత్తమ్మ. కేసీఆర్ చేసిన ఈ సాయాన్ని ఎన్నడూ మరువలేనని కొనియాడింది.
Also Read: Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
ఫొటోలో కేసీఆర్ ఇచ్చిన చెక్ ను సత్తమ్మకు అందిస్తున్న ఎర్రబెల్లి దయాకర్