Blackmail: వీడియోలు లీక్ చేస్తా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బెదిరింపులు!

TG: తనకు గుర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లేదంటే తన పరువుకు భంగం కలిగించే వీడియోలను విడుదల చేస్తానని హెచ్చరించినట్లు తెలిపారు.

MLA Satyam
New Update

MLA Satyam: చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. తనకు గత నెల గుర్తు తెలియని నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చిందని.. రూ.20లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... విచారణ చేసి లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశారు. 

Also Read :  'కంగువా' మూవీ టీమ్ కు బిగ్ షాక్.. అతని ఆకస్మిక మరణంతో?

తన పిల్లల్ని అనాధలుగా...

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని చొప్పదండి అసెంబ్లీ  నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు గత సెప్టెంబర్ నెలలో 28వ తేదీన మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో తెలియని నెంబర్ +447886696497 నుండి వాట్సాప్ ద్వారా ఫోన్ కాల్ వచ్చిందని, అందులో నిందితుడు కాల్ లో మాట్లాడుతూ తనకు 20 లక్షల రూపాయలు చెల్లించాలని లేనియెడల తనను రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి తన గౌరవానికి భంగం కలిగే చర్యలకు పాల్పడతానని.. తన ఇద్దరు పిల్లలను అనాధలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు గురి చేసినట్లు  బాధితుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇచ్చారు.

Also Read :  యష్మి చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నిఖిల్.. బతిమాలినా వద్దంటూ

ఇచ్చిన ఫిర్యాదు మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు పై విచారణ జరిపిన పోలీసులు నిందితుడు రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ లోని భవాని నగర్ కి చెందిన యాస అఖిలేష్ రెడ్డి (33) అని, ఇతడు ప్రస్తుతం లండన్ లో ఉన్నాడని,  అక్కడినుండి బెదిరింపులకు పాల్పడ్డాడని  తేలిందని సదరు నిందితుడిపై బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్కులర్ జారీ చేశామని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.

Also Read :  రేవంత్‌కు బిగ్ షాక్..కేసీఆర్‌కు టచ్‌లోకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు?

Also Read :  మెగాస్టార్ మూవీలో మీనాక్షి చౌదరి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

#medipally-sathyam #threatening-mails #congress-mla #blackmail
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe