Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య బలవన్మరణం!
కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు.ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. బలవన్మరణానికి కారణాలు తెలియలేదు.