యష్మీ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నిఖిల్.. బతిమాలినా వద్దంటూ.. బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో మొదలైన 'పానిపట్టు యుద్ధం' టాస్క్ ఇంకా కొనసాగుతున్నట్లుగా ప్రోమోలో చూపించారు. ఇందులో భాగంగా నిఖిల్, యష్మీ మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. యష్మీ విషయంలో హార్ట్ అయిన నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ప్రోమో మీరు కూడా చూసేయండి. By Archana 30 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update Bigg Boss Telugu 8 షేర్ చేయండి Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 రోజురోజుకు ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే 8 వారాలు పూర్తి చేసుకొని 9వ వారంలో అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో మూడు టీమ్స్ గా విడిపోయిన కంటెస్టెంట్స్ మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 'పానిపట్టు యుద్ధం' అనే టాస్క్ ఆడారు. Also Read: 'కంగువ' కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. ఊహించని విధంగా రన్ టైం ! లేటెస్ట్ ప్రోమో తాజాగా బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశాడు. ఈ ప్రోమోలో నిన్న మొదలైన 'పానిపట్టు యుద్ధం' ఇంకా కొనసాగుతున్నట్లుగా చూపించారు. ఇందులో యష్మీ, నిఖిల్ మధ్య నిన్న ఎపిసోడ్ లో జరిగిన గొడవ గురించి మరో సారి వాదన మొదలైంది. టాస్క్ లో నన్ను, ప్రేరణను లాగావురా అంటూ యష్మీ నిఖిల్ తో వాదించింది. దీంతో నిఖిల్.. నేను అలా చేస్తే మీరు అసలు అక్కడ నిల్చునే వారే కాదని చెప్పి వెళ్ళిపోయాడు నిఖిల్. Also Read: Venkatesh: వెంకీ-అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ కంప్లీట్.. టైటిల్, ఫస్ట్ లుక్ ఎప్పుడంటే? కన్నీళ్లు పెట్టుకున్న నిఖిల్ ఇక యష్మీ మాటలకు హార్ట్ అయిన నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత యష్మీ.. నిఖిల్ దగ్గరకు వచ్చి.. అతన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది. కానీ నిఖిల్ మాత్రం.. నేను ఎవరితో మాట్లాడాలని అనుకోవడం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రోమోలో చూపించారు. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడంతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే 8 వారాలు పూర్తవగా.. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. Also Read: ఇంత అందగా ఉందేంటి.. రాశీ ఖన్నా దీపావళి మెరుపులు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి