Kanguva: 'కంగువా' మూవీ టీమ్ కు బిగ్ షాక్.. అతని ఆకస్మిక మరణంతో?

ఫిల్మ్‌ ఎడిటర్‌ నిషాద్‌ యూసఫ్‌ కన్నుమూశారు. తన ఇంట్లో బుధవారం ఉదయం విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సూర్య హీరోగా తెరకెక్కిన ‘కంగువా’కు నిషాద్‌ ఎడిటర్‌గా పనిచేశారు. అతని ఆకస్మిక మరణంతో చిత్ర యూనిట్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

New Update
Sfsg

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ ఫిలిం ఎడిటర్ నిషాద్ యూసఫ్ కన్నుమూశారు. బుధవారం ఉదయం తన ఇంట్లో విగతజీవిగా కనిపించారు. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్‌ తన అపార్ట్‌మెంట్‌లో కన్నుమూసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా నిషాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కంగువా’కు నిషాద్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నవంబర్ 14 న ఈ సినిమా విడుదల కానుంది. ఇలాంటి తరుణంలో ఆ సినిమాకు చెందిన టెక్నీషియన్ ఇలా ఆకస్మికంగా మృతి చెందడంతో చిత్ర యూనిట్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. 

Also Read :  పీరియడ్స్‌ టైమ్‌లో ఈ తప్పులు చేయకండి

Also Read : మెగాస్టార్ మూవీలో మీనాక్షి చౌదరి.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

ఇక నిషాద్ యూసఫ్ మలయాళ, తమిళ సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2022లో విడుదలైన ‘తల్లుమాల’ చిత్రానికి గాను నిషాద్‌ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ట్రం నుంచి అవార్డును అందుకున్నారు. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న బాజూకా సినిమాకు నిషాద్‌ వర్క్‌ చేస్తున్నారు. ఆయన మరణించినట్లు ‘ది ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ డైరెక్టర్స్‌ యూనియన్‌’ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ పెట్టింది.

Also Read :  నాపై డ్రగ్స్‌ కుట్ర చేశారు..ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు

Also Read : నాగ చైతన్యకు ఊహించని షాకిచ్చిన సమంత.. లీగల్ నోటీసులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు