Telangana News: ఇద్దరు భార్యల నామినేషన్.. ఏ భార్య సర్పంచ్ అంటే?

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట- భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే రజిత తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో సర్పంచ్ పదవికి లావణ్య ఏకగ్రీవంగా ఎన్నికైంది.

New Update
siddipet

siddipet

తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట- భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ ఎన్నికల్లో నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన ఇద్దరు భార్యలు లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే వీరిద్దరూ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో రజిత తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో లావణ్య ఒక్కరే పోటీలో ఉండటంతో సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైంది.

ఇది కూడా చూడండి: Trudeau-Perry: అవును మేమిద్దరం ప్రేమలో ఉన్నాం.. ట్రూడో, కేటీ పెర్రీ ఇన్స్టాలో పోస్ట్ లు

ఒకే కుటుంబానికి చెందిన..

పంచాయతీ పరిధిలో ఉన్న 10 వార్డులు కూడా ఏకగ్రీవం కావడంతో లావణ్య సర్పంచ్‌గా ఎన్నికైంది. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు పాజిటివ్‌గా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నెగిటివ్‌గా చేస్తున్నారు. అయితే లావణ్య, రజిత వీరిద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు. ఈ విషయం తెలుసుకుని కొందరు షాక్ అవుతున్నారు. మరికొందరు ఇద్దరు భార్యలతో నామినేషన్ ఏంటని, ఇద్దరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారా? అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Explainer: గుండెకు మేలు చేసే అద్భుతమైన ఆహారాలు.. జబ్బులను దూరం చేసే పోషకాహార రహస్యం

Advertisment
తాజా కథనాలు