/rtv/media/media_files/2025/10/12/bjp-key-announcement-in-a-few-hours-who-is-the-candidate-2025-10-12-08-59-23.jpg)
BJP's key announcement in a few hours... Who is the candidate?
BJP Candidate: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ మృతితో వచ్చిన ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మాగంటి సతీమణి సునీతకు టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. అనేక వడపోతల అనంతరం నవీన్‌కుమార్ యాదవ్‌కు టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలింది బీజేపీ. బీజేపీ నుంచి పోటీ చేయడానికి పలువురు ప్రయత్నించినప్పటికీ ముగ్గురు పేర్లను తెలంగాణ బీజేపీ షార్ట్ లిస్ట్ చేసి హై కమాండ్ కు పంపినట్లు సమాచారం.
Also Read : Medical Student : వెస్ట్ బెంగాల్ లో మరో దారుణం.. MBBS స్టూడెంట్ పై రేప్.. ఫోన్ లాక్కుని
అయితే వారిలో ఇద్దరి పేర్లు మాత్రమేఅధిష్టానం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ప్రధాన పోటీ మాత్రం లంకల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి మధ్య ఉందని కమలం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఫైనల్ లిస్ట్ తో ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ఈ రోజు అభ్యర్థి పేరుతో తిరిగి రానున్నాడని, అనంతరం అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
Also Read : ఈ బంగారం కేవలం రూ.10 వేలే.. వెంటనే ఆ ఆభరణాలు చేయించుకోండి!
అయితే సిట్టింగ్ స్థానాన్ని బీఆర్‌ఎస్ మహిళకు కేటాయించినందున బీజేపీ కూడా మహిళకు ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తుందట. లేదంటే గత ఎన్నికల్లో పోటీ చేసినవారికే మళ్లీ అవకాశం ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ అలా చేస్తే దీపక్ రెడ్డికి టికెట్ దక్కవచ్చు. లేక ఉప ఎన్నిక కాబట్టి ప్రయోగాత్మకంగా మహిళకు అవకాశం ఇస్తే..? జూటూరి కీర్తి రెడ్డికి అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి జూటూరి కీర్తి రెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, లంకల దీపక్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ పేర్లను త్రి సభ్య కమిటీ ఫైనల్ చేసినట్లు ప్రచారం సాగింది. అయితే అనేక వడపోతల అనంతరం లంక దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి పేర్లనే రాష్ట్ర నాయకత్వం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.ఈ ఇద్దరిలో ఒకరికే అవకాశం దక్కే అవకాశం ఉంది. కనుక దీపక్ రెడ్డి ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నందున కీర్తిరెడ్డికి కేటాయించే అవకాశాలు లేకపోలేదు. ఏదేమైన మరికొన్ని గంటల్లో బీజేపీ అభ్యర్థి ఎవరనేది తేలనుంది.
ఇది కూడా చదవండి: 13 ఏళ్ల దొంగను ఉరికించి ఉరికించి.. ఈ పాప ధైర్యానికి అందరూ షాక్!