CRIME: 13 ఏళ్ళ బాలిక ఇంట్లో చొరబడిన దొంగకు చెమటలు పట్టించింది. ఒంటరిగా చోరీని అడ్డుకొని.. దొంగను తరిమి తరిమి కొట్టింది! ఈ బాలిక ధైర్య సాహాసాలకు కాలనీ వాసులంతా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులోనే ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా ప్రాణాలకు తెగించి దొంగకు ఎదురెళ్ళిన ఆమె ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని చింతల్‌భగత్ సింగ్ నగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చింతల్‌భగత్ సింగ్ నగర్‌లో పట్టపగలే ఓ దొంగ తాళం వేసిన ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన 13 ఏళ్ల బాలిక భవాని దొంగను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. బాలికను చూడగానే దొంగ పరుగులు తీయడం మొదలు పెట్టాడు. అయినప్పటికీ భవానీ అతడిని వదల్లేదు.. దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. ప్రాణాలకు తెగించి మరీ అతడిని వెంబడించింది. భవానీ అడ్డుకోవడంతో దొంగ చోరీ చేయకుండానే పరారయ్యాడు. చుట్టు పక్కన ఎవరూ లేకపోయినా.. భవానీ ఎంతో ధైర్యంతో దొంగను ఎదురించడానికి ముందుకెళ్లింది. ఈ బాలిక ధైర్య సాహసాలపై కాలనీ వాసులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Bigg Boss Telugu: రీతూకి దొబ్బిన చిప్.. భరణి హౌజ్ లో వేస్ట్ .. నాగ్ మామ ముందే రెచ్చిపోయిన ఆడియన్!