రాష్ట్రాల అధ్యక్షులు, నేషనల్ కౌన్సిల్ మెంబర్ల నియామకం కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలక్షన్ ఆఫీసర్లను నియమించింది. ఈమేరకు కొద్దిసేపటి క్రితం 29 మందితో కూడిన లిస్టును బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. తెలంగాణకు ఎలక్షన్ ఆఫీసర్ గా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్‌లాజేను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌కు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, కర్ణాటకకు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఉత్తరప్రదేశ్‌కు కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బీహార్‌కు కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎన్నికల అధికారిగా నియమించారు.
Also Read: New Virus: చైనాలో మరో ప్రాణాంతక వైరస్..మళ్ళీ ముప్పు?