/rtv/media/media_files/2025/08/02/srusti-2025-08-02-19-10-01.jpg)
Srushti Fertility Case
Srishti Fertility Case:
సరోగసీ పేరుతో పిల్లలు లేని దంపతులను మోసం చేసి లక్షలాది రూపాయలు కాజేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో(Dr Namratha fertility scam) సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ నమ్రత అసలు పేరు అది కాకపోగా ఆమె ఎవరికీ సరోగసీ చేసిన దాఖలాలు లేవని తేలింది. కేవలం పిల్లలను కొనుగోలు చేసి అమ్మడమే ఆమె వృత్తిగా పెట్టుకున్నట్టు తేలింది. పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు ( నేరాంగీకర నివేదిక) లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. (Dr Namratha police case)
Also Read:"50 ఏళ్ల లెజెండరీ జర్నీకి హాట్స్ ఆఫ్..!" మోడీ, చంద్రబాబు విషెస్ కు తలైవర్ రిప్లై ఇదే..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ కేసులో సీసీఎస్ సిట్ (CCS SIT) తన విచారణను వేగం చేసింది. అందులో భాగంగా ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను విచారించింది .ఆమె ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్టు చూస్తే కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. విచారణలో తాను నేరం చేసినట్లుగా డాక్టర్ నమ్రత అంగీకరించింది. అంతేకాదు తను సరోగసీ పేరిట జనాలను మోసం చేసినట్లు కూడా ఒప్పకుంది. కేవలం ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనగోలు చేసి తన వద్దకు వచ్చే దంపతులను నమ్మించి వారికి పిల్లలను విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిపింది.
దంపతులకు సరోగసి పేరిట రూ.30 లక్షల వరకు వసూలు చేశామని అంగీకరించింది. అంతటితో ఆగకుండా అబార్షన్ కోసం వచ్చే గర్భిణులకు డబ్బు ఆశ చూపి.. ప్రసవం అయ్యాక వారి నుంచి పిల్లలను కొనుగోలు చేసినట్లుగా వెల్లడించింది. అలా ఎంతోమంది పిల్లలు లేని దంపతులను మోసం చేశామని.. సరోగసి ద్వారానే పిల్లలను పుట్టించినట్లుగా నమ్మించామని డాక్టర్ నమ్రత తన వాంగ్మూలం లో పేర్కొంది. పిల్లల కొనుగోలు వ్యవహారంలో ఆమె అనుచరులు సంజయ్‌తో పాటు.. సంతోషీ కీలకంగా వ్యవహరించినట్లుగా వివరించింది. ఏవైనా సమస్యలు వస్తే తన రెండో కుమారుడు లీగల్‌గా సహకరించేవాడంటూ నమ్రత తన నేరాంగీకర రిపోర్టులో స్పష్టం చేసింది.
Also Read: బెంగళూరులో ఘోర అగ్ని ప్రమాదం.. సిలిండర్ పేలి స్పాట్‌లోనే 10 మందికి..
డాక్టర్ నమ్రత అసలు పేరు కాదు..
ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఏంటంటే డాక్టర్ నమ్రత అసలు పేరు నమ్రత కాదు.పోలీసుల దర్యాప్తులో ఆది కాస్తా బహిర్గతమైంది. నమత్ర అనేది ఆమె నిజమైన పేరు కాదని తేటతెల్లమైంది. ఆమె అసలు పేరు అట్లూరి నీరజ అని స్పష్టమైనట్లు సమాచారం. కానీ, డాక్టర్ నమ్రత పేరుతోనే అట్లూరి నీరజ సరోగసి వ్యవహారాలన్నీ నడిపిందని పోలీసుల విచారణలో తేలింది. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో నీరజ మెడిసిన్ చేసింది. ఇక ఇదే కాలేజీలో చదివిన తన1988 బ్యాచ్ మేట్స్‌తో సైతం ఆమె సరోగసి దందా చేయించినట్లుగా వెల్లడైంది. ఇలాంటి కేసులో దొరికితే తన పేరు బయటకు లీక్ కాకుండా ఉండేందుకే ఆమె పేరు మార్చుకున్నట్లు తేలింది. అందుకే నకిలీగా పెట్టుకున్న నమ్రత పేరుతోనే ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లుగా నిర్ధారణ అయింది. అయితే కాగాఈ కేసును నార్త్ జోన్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి బదిలీ చేశారు. మరోవైపు అట్లూరి నీరజపై 15 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: TS: పదవులు మీకే..పైసలు మీకే..కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి సంచలన వ్యాఖ్యలు