/rtv/media/media_files/2025/10/25/chiranjeevi-2025-10-25-16-54-22.jpg)
Chiranjeevi
Chiranjeevi: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవికి సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఫొటోలు, బిరుదులు వాడుకోవడాన్ని నిరోధిస్తూ మధ్యంతర కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జి ఎస్.శశిధర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఆన్‌లైన్ దుస్తుల సంస్థలు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లు సహా ఏ సంస్థ కూడా చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ‘మెగాస్టార్’, ‘చిరు’ వంటి బిరుదులు, ఆయన ఫొటోలు, వాయిస్‌ను వ్యాపార ప్రకటనల కోసం వినియోగించకూడదని తీర్చునిచ్చింది. రకరకాల సంస్థలు తన అనుమతి లేకుండా తన గుర్తింపును వాడుకుంటూ వాణిజ్యపరంగా లబ్ధి పొందుతున్నాయని చిరంజీవి ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన కోర్టు తక్షణమే ఉల్లంఘనలను ఆపాలని ఆదేశిస్తూ స్టే మంజూరు చేసింది. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు చలనచిత్ర రంగం అనగానే చిరంజీవి గుర్తుకు వస్తాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆయన సినిమాల్లోకి వచ్చి పెద్ద హీరోగా ఎదిగారు. అభిమాన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీసుని ఒక ఊపు ఉపారు. సొంత టాలెంట్‌తో హీరోగా, నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్ వరకు ఎదిగారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన తర్వాత ఎంత మంది స్టార్స్ వచ్చినా, ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే అని చెప్పచ్చు. అంతేకాదు డెబ్బై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఈ ఏడాది వరుసగా మూడు నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు చిరు.
అయితే మెగాస్థార్‌గా కీర్తిని సొంతం చేసుకున్న చిరంజీవి పేరును పలు సంస్థలు, వ్యక్తులు ఎన్నో రకాలుగా వాడుకుంటున్నారు. కొందరు కమర్షియల్‌గానూ వాడుతుంటారు. ఆయన పేరుని, ఫోటోలను వాడుతూ సొమ్ము చేసుకునేంటున్నారు. వ్యాపార కార్యకలాపాలకు కూడా ఆయన పేరుని, ఫోటోలను వాడుతున్నారు. చిరంజీవి అనుమతి లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ఏదైనా లోపం తలెత్తితే అది చిరంజీవికి అంటగడుతున్నారు. అయితే ఇకపై అలా కుదరదు. చిరంజీవి పేరును, ఫోటోలను వాడితే ఇక మీదట జైలుకే. తాజాగా కోర్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. చిరంజీవి పేరును మిస్ యూజ్ చేస్తే ఆ నష్టాన్ని డబ్బుతో వెలకట్టలేమని కోర్టు తెలిపింది. ఇది చిరంజీవి వ్యక్తిగత హక్కులను కాపాడే ఉద్దేశ్యమని పేర్కొంది.
మెగాస్టార్ చిరంజీవి పేరు, ఇమేజ్, వాయిస్, బిరుదులను అనధికారికంగా వాడటం, ఏఐ ద్వారా సృష్టించడం నుంచి రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఏ మీడియా సంస్థ అయినా, యూట్యూబ్ ఛానెల్ అయినా, బ్రాండ్(ప్రకటనలు) అయినా, వ్యక్తి అయినా చిరంజీవి అనుమతి లేకుండా అతని పోలిక, గుర్తింపులను కానీ ఉపయోగించడానికి వీలులేదు.చిరు ఇమేజ్, టైటిల్స్, వాయిస్‌లను దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే నష్టాన్ని డబ్బు భర్తీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. ప్రజలతో చిరంజీవికి నేరుగా ముడిపడి ఉన్న `మెగాస్టార్, బాస్, అన్నయ్య, చిరు` వంటి ట్యాగ్‌లకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అనేక కంపెనీలు, సోషల్ మీడియా ఖాతాలు అనుమతి లేకుండా చిరంజీవి ఫోటోలను, ఏఐ జనరేటెడ్ చిత్రాలు ముద్రించిన టీషర్టు లు, పోస్టర్లు వంటి వస్తువులను అమ్ముతున్నాయని చిరంజీవి తరఫు న్యాయవాది కోర్టుకి వివరించారు. అవి తప్పుదారి పట్టించేవిగా, ఆయన ప్రతిష్టని దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు చిరంజీవి పర్సనాలిటీ రైట్స్ ని కాపాడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ సంస్థలకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ అక్టోబర్ 27కి వాయిదా వేసింది కోర్ట్. అప్పటి వరకు చిరంజీవి పేరుని ఏ రకంగానూ మిస్ యూజ్ చేయకూడదని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై చిరంజీవి పేరుని, ఇమేజ్ ని వాడుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటే జైలుకు వెళ్లడం ఖాయం అంటూ తేల్చి చెప్పింది.
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ .. రిషబ్ శెట్టి 'కాంతారా' ను ఆకాశానికెత్తిన అల్లు అర్జున్! పోస్ట్ వైరల్
Follow Us