/rtv/media/media_files/2025/06/24/ias-amrapali-2025-06-24-20-45-04.jpg)
IAS Amrapali
ఐఏఎస్ ఆమ్రపాలికి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్)లో ఊరట లభించింది. తెలంగాణ నుంచి రిలీవై ఏపీ క్యాడర్‌లో చేరిన ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో తెలంగాణలో పని చేసిన ఆమె.. ఇటీవల మళ్లీ తెలంగాణకు కేటాయించాలని కోరగా క్యాట్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: వందేభారత్ రైలులో దారుణం..సీటు మారలేదని ప్రయాణికుడిని చితకబాదిన ఎమ్మెల్యే
ఇక వివరాల్లోకి వెళ్తే.. అమ్రపాలీ నాలుగు నెలల క్రితం ఏపీకి ట్రాన్స్‌ఫర్ అయిన సంగతి తెలిసిందే. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఉత్తర్వులతో ఆమె అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో డీవోపీటీ ఆదేశాలు సవాలు చేస్తూ ఆమె క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తనకు తెలంగాణలోనే పోస్టు కేటాయించాలంటూ కోరారు. చివరికి పిటిషన్‌ను అనుమతించిన క్యాట్.. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అమ్రపాలీని తెలంగాణకు కేటాయించాలని ఆదేశించింది.
Also Read: ఇదేం ప్రేమరా నాయనా...సొంతింటి కల కోసం..20 మంది అబ్బాయిలతో ప్రేమాయణం