Tiger: పెద్దపులి కామ వాంఛ తీరలేదు. ఆడ తోడు కోసం ఆడవులన్నీ జల్లెడ పడుతోంది. గత రెండు నెలలుగా వందల కిలోమీటర్ల తరబడి ప్రయాణం కొనసాగిస్తూనే ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీష్‌గడ్ బార్డర్‌లో ఆడపులి జాడకోసం తిరుగుతున్న బెంగాల్ టైగర్.. కోరిక తీరని ఆవేశంతో ఎదురుపడిన జంతువులు, మనుషులపై దాడి చేస్తోంది. ఇటీవలే తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఇద్దరిపై దాడిచేసిన పెద్దపులి జర్నీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు దాని జాడ కనిపెట్టారు. ఇటీవల తాడ్వాయి, వాజేడు, వెంకటాపురం మీదుగా గోదావరి తీరం వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న పులి.. అక్కడి నుంచి తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి వచ్చి అక్కడే తిష్టవేసినట్లు అటవీశాఖ రేంజ్ అధికారి సత్తయ్య వెల్లడించారు. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి.. ఈ మేరకు తాడ్వాయి మండలం బందాల అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు. గత వారం పంబాపురం, నర్సాపురం, బందాల అడవుల్లో జంతువులను వేటాడిన ఆనవాళ్లు లభించినట్లు బయటపెట్టారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇరవై రోజులకుపైగా అటవీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిందని, శృంగారం వేటలోభాగంగా ఆడతోడు కోసం అడవులన్నీ జల్లెడపడుతుందని చెప్పారు. ఆదిలాబాద్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయి, మంగపేట, వాజేడు, వెంకటాపురం, ఇంద్రావతి మీదుగా కొత్తగూడెం మణుగూరు అటవీ ప్రాంతానికి నడుచుకుంటూ వచ్చిన పాదముద్రలున్నట్లు తెలిపారు. 2021లో ఛత్తీస్‌గఢ్ ఇంద్రావతి టైగర్ రిజర్వ్ నుంచి మేటింగ్ కోసం ములుగు అడవులకు వచ్చిన పులే ఈసారి కూడా వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: Dil Raju: శ్రీతేజ్ తండ్రికి జాబ్.. నిర్మాత దిల్‌రాజు కీలక ప్రకటన! 2021లోనూ ఇదే పులి.. ఇక గత నాలుగైదేళ్లుగా పులుల సంచారానికి సంబంధించిన కెమెరా ట్రాప్‌లను పరిశీలించిన తర్వాతే అది ఎక్కడ నుంచి వచ్చిందనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఈ పులి ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, తాడ్వాయిల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం వరకు పులి కారిడార్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. 2021లోనూ వరంగల్, ములుగు, తాడ్వాయి, మంగపేట, కరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించినట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు.