/rtv/media/media_files/2025/05/16/fRcikWwJdoPFXBzt63dI.jpg)
Pillalamarri Banyan Tree
ప్రపంచ సుందరీమణుల పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన అందాల భామలు శుక్రవారం పాలమూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా 750 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రిని సందర్శిస్తారు. ఆ ప్రదేశంలో కలియతిరుగుతూ రెండు గంటలపాటు సందడి చేస్తారు. పోటీల కోసం వచ్చిన ముద్దుగుమ్మలు ఇప్పటికే తెలంగాణ లోని పలు సందర్శనీయ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా పిల్లలమర్రిని కూడా సందర్శించనున్నారు.
Also Read : వివో ఇచ్చిపడేశాడు భయ్యా.. కొత్త ఫోన్ లాంచ్.. ఇయర్‌బడ్స్ ఫ్రీ - ఆఫర్లు అదుర్స్!
Miss World 2025
మొత్తం పోటీదారుల్లో 22 మంది అందాల సుందరీమణులు నేటి సాయంత్రం ఐదు గంటలకు పిల్లలమర్రికి చేరుకుంటారు. సాయంత్రం ఏడు గంటల వరకు పిల్లలమర్రి పరిసరాల్లో సందడి చేయనున్నారు. అంతకు ముందు అక్కడే ఉన్న 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. పాలమూరు లోని పురావస్తు మ్యూజియంను సందర్శించి అక్కడి పురాతన వస్తువులను వీక్షిస్తారు.
Also Read: ట్రంప్ ఫ్యామిలీతో పాకిస్థాన్ వ్యాపారం.. అసలేం జరుగుతోంది?
కాగా పిల్లలమర్రి సందర్శన సందర్భంగా తెలంగాణ గురుకుల పాఠశాలల విద్యార్థులతో అందాల భామలు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా నిర్వహించనున్నారు. మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా పాలమూరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పిల్లలమర్రి కి వెళ్లే మెట్టుగడ్డ గ్రామం నుంచి పిల్లలమర్రి వరకు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా13 వందల మంది పోలీసులతో మూడంచల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇక తమ ప్రాంతానికి వస్తున్న అందాల భామలకు స్వాగతం పలికేందుకు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పిల్లలమర్రి సందర్శన అనంతరం వారు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
Also Read : మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ అక్రమాలు.. YS రెడ్డిపై ఈడీ రైడ్స్!
Also Read : దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన
Pillaramarri | Miss World 2025 hyderabad | miss-world-india | miss-world