ED RAIDS: మున్సిపల్ కార్పొరేషన్‌లో భారీ అక్రమాలు.. YS రెడ్డిపై ఈడీ రైడ్స్!

ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ YS రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ముంబైలోని వసాయ్ విరార్ పరిధిలో అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించి అతని ఆస్తులపై సోదాలు నిర్వహించింది.  23 కోట్ల డైమండ్స్, 9 కోట్ల నగదు, 8 కోట్ల బంగారం, నగలు, కీలక పత్రాలు సీజ్ చేసింది. 

New Update
ed mumbai

ED raids on Mumbai Town Planning Deputy Director YS Reddy

ED RAIDS: ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ YS రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ముంబైలోని వసాయ్ విరార్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తించి అతని ఆస్తులపై సోదాలు నిర్వహించింది. 23 కోట్ల డైమండ్స్, 9 కోట్ల నగదు, 8 కోట్ల బంగారాన్ని సీజ్ చేసింది. 

ఈ మేరకు హైదరాబాద్‌తో సహా ఏకకాలంలో 13 చోట్ల దాడులు చేసింది. ఈ దాడుల్లో కీలకమైన డాక్యుమెంట్స్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.- దాదాపు 100 కోట్ల విలువైన YS రెడ్డి ఆస్తులు సీజ్ చేశామని, ఇప్పటి వరకు 41 భవనాలకు అక్రమ అనుమతులు మంజూరు చేయించుకున్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. బిల్డర్స్‌తో కుమ్మక్కై అనుమతులకు YS రెడ్డి లంచం తీసుకున్నట్లు కంప్లైట్స్ రావడంతో ఈడీ సోదాలు ప్రారంభించింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు