Shashi Tharoor: దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన

ఇటీవల ప్రధాని మోదీని పొగిడిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. భారత్‌-పాక్‌ యుద్ధం విషయంలో ఒక భారతీయుడిగా మాత్రమే ప్రధానిని పొగిడానని స్పష్టం చేశారు. దీనికి పార్టీ అభిప్రాయంతో సంబంధం లేదన్నారు.

author-image
By B Aravind
New Update
Shashi Tharoor Clarifies His India-Pakistan Remarks Were Personal, Not Congress' Views

Shashi Tharoor Clarifies His India-Pakistan Remarks Were Personal, Not Congress' Views

ఆపరేషన్ సిందూర్‌ సక్సెస్‌ కావడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ప్రధాని మోదీని ప్రశంసించిన సంగతి తెలిసిందే. ప్రధాని వ్యవహరిస్తున్న తీరు అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యక్తలు ఆయనపై విమర్శలు చేశారు. శశిథరూర్‌ లక్షణరేఖ దాటారంటూ మండిపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై శశిథరూర్‌ స్పందించారు.  

'' భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన యుద్ధాన్ని మనం ప్రత్యేక కోణంలో చూడాలి. నేను ఒక దేశ పౌరుడిగా మాత్రమే ప్రధాని మోదీని పొగిడాను. ఇలా చెప్పడం నాకు గర్వంగా ఉంది. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే. దీనికి పార్టీ అభిప్రాయంతో సంబంధం లేదని'' శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read: పబ్లిక్‌లో యువతి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని బీజేపీ నేత డ్యాన్స్.. వీడియో వైరల్!

Shashi Tharoor Clarifies His India-Pakistan Remarks

ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌ కావడంతో ప్రధాని మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై ఇటీవల కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అద్భుతమని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపించామని చెప్పారు. పాకిస్థాన్‌ తాము ఏదో సాధించినట్లు చెప్పుకుంటోందని దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.  

Also Read: నేను భారత్-పాక్ యుద్ధం ఆపలేదు.. మాట మార్చిన ట్రంప్

'' ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అంతా చూశాం. పాకిస్థాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రిగా మోదీ ఏం చేయాలో ఆ పని చేస్తున్నారు. ప్రత్యేక సంక్షోభ సమయంలో మోదీ వ్యవహరిస్తున్న తీరు అద్భుతం. కోవిడ్ లాంటి మహమ్మారి అయిన దేశద్రోహులపై మోదీ స్పందిస్తున్న తీరు వెలకట్టలేని. దేశానికి ఏది ముఖ్యమో అది ప్రధానిగా మోదీ చేస్తున్నారని'' శశిథరూర్ కొనియాడారు. ఇకపై ప్రధాని ఇలావే వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Also Read: పబ్లిక్‌లో యువతి ప్రైవేట్ పార్ట్స్ పట్టుకుని బీజేపీ నేత డ్యాన్స్.. వీడియో వైరల్!

Also Read :  వివో ఇచ్చిపడేశాడు భయ్యా.. కొత్త ఫోన్ లాంచ్.. ఇయర్‌బడ్స్ ఫ్రీ - ఆఫర్లు అదుర్స్!

Short News | Latest News In Telugu | నేషనల్ | rtv-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు