Maoist: మావోయిస్టులతో చర్చల్లేవ్.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన!

మావోయిస్టులతో శాంతి చర్చలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఎంతోమంది అమాయకులను చంపిన నక్సలైట్లతో చర్చల ప్రసక్తే లేదన్నారు. వారు ఆయుధాలు వీడిన తర్వాతే చర్చల గురించి ఆలోచిస్తామని చెప్పారు.

New Update
bandi mao

Bandiya Sanjay sensational statement on Maoists

Bandi sanjay: మావోయిస్టులతో శాంతి చర్చలపై కేంద్రమంత్రి బండియ సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఎంతోమంది అమాయకులను చంపిన నక్సలైట్లతో చర్చల ప్రసక్తే లేదన్నారు. వారు తుపాకీ వీడిన తర్వాతే ఆలోచిస్తామని చెప్పారు.

మాటల్లేవ్..

ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. ‘తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవు. మావోయిస్టులతో ఇక మాటల్లేవ్‌.. మాట్లాడుకోడాల్లేవ్‌. వారిపై నిషేధం విధించింది కాంగ్రెస్ పార్టీనే. మావోయిస్టులు ఎంతోమంది నేతలను మందుపాతరలు పెట్టి చంపారు. ఇన్‌ఫార్మర్ల పేరుతో గిరిజనులను అన్యాయంగా పొట్టనపెట్టుకుంటున్నారు. గిరిజనుల కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారు. తుపాకీ వదిలిపెట్టేవరకు మావోయిస్టులతో చర్చల ఊసే లేదు' అని స్పష్టం చేశారు. 

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

ఇదిలా ఉంటే.. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కర్రెగుట్టలను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ కగార్‌ సక్సెస్‌కు గుర్తుగా అక్కడ జాతీయ జెండాను కూడా ఎగురవేశారు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో గత పదిరోజులుగా సాయుధ బలగాలకు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. మొత్తంగా 20 వేల మంది సాయుధ బలగాలు అన్ని వైపుల నుంచి సెర్చ్‌ ఆపరేషన్ ప్రారంభించాయి.

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

telugu-news | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు