Bandi Sanjay: హరీశ్‌ రావు ఫోన్‌ కూడా ట్యాప్ చేశారు.. బండి సంజయ్ సంచలనం

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై జరిగిన సిట్‌ విచారణ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ విచారణ కొనసాగింది. ఫోన్‌ ట్యాపింగ్‌పై తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన సిట్ అధికారులకు అందించారు.

New Update

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై జరిగిన సిట్‌ విచారణ ముగిసింది. దాదాపు గంట పాటు ఈ విచారణ కొనసాగింది. ఫోన్‌ ట్యాపింగ్‌పై తన వద్ద ఉన్న ఆధారాలను ఆయన సిట్ అధికారులకు అందించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఫోన్‌ ట్యాపింగ్ జరిగినట్లు తెలిపారు. హైకోర్టులో తనపై ఉన్న కేసుల ధర్మాసనం జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్‌ చేశారని  చెప్పారు. బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది మధు, ప్రవీణ్‌ రావు, తిరుపతిని వేర్వేరుగా సిట్ విచారించింది. 

Also read: తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

 ఆ తర్వాత బయటకు వచ్చిన బండి సంజయ్‌ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. '' కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎక్కువగా నా ఫోన్‌ను ట్యాప్ చేయడం నన్ను షాక్‌కు గురిచేసింది. మావోయిస్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం ఈ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడింది. ఆ ఫ్యామిలీకి వావి వరుస లేదు. రేవంత్ రెడ్డి, హరీష్‌ రావు ఫోన్‌లు కూడా ట్యాప్ చేశారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్ గురించి మొదట నేనే మాట్లాడాను. 

విచారణలో అధికారులు చూపించిన వివరాలు చూసి షాకయ్యాను. ఆఖరికి భార్యభర్తన ఫోన్‌ సంభాషణలు విన్న మూర్ఖులు, నీచులు వీళ్లు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కేటీఆర్‌ తన లావాదేవీల కోసం రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు. సమాజం వీళ్లను క్షమించదు. వీళ్లకు ఉరిశిక్ష వేసినా సరిపోదు. ట్యాపింగ్ చేసిన వాళ్లని రేవంత్ ప్రభుత్వమే కాపాడే ప్రయత్నం చేస్తోంది. 

Also read: తిరిగి రారా తమ్ముడా.. చితిపైనే తమ్ముడికి రాఖీ కట్టిన అక్క

చాలామంది వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కేటీఆర్‌ వాళ్లని బ్లాక్‌మెయిల్ చేశాడు. అసలు ఈ కేసుపై రేవంత్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కమిషన్లు, కమిటీలు వేస్తారు, రిపోర్డులు తీసుకుంటారు, కానీ చర్యలకు మాత్రం ముందుకు రారు. బీఆర్‌ఎస్-కాంగ్రెస్‌ మధ్య అండర్‌స్టాండింగ్‌ ఉంది. అందుకే చర్యలు తీసుకోవడం లేదు. ఢిల్లీకి వందల కోట్లు మూటలు మోస్తున్నారు. సీఎం రేవంతే కేసీఆర్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చారు. కేసీఆర్ ఏం చెబితే రేవంత్ అదే చేస్తున్నాడు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాం. అరెస్టులపై పోలీసులు చెప్పిన విషయాలు సీఎం ఎలా చెబుతారు . రిటైర్‌ అయిన ప్రభాకర్‌ రావును SIBలో ఎలా పెడతారు. సీబీఐకి ఈ కేసు అప్పగిస్తేనే కేసీఆర్‌ కుటంబం బండారం బయటపడుతుందని'' బండి సంజయ్ అన్నారు. 

Also read: తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

Advertisment
తాజా కథనాలు