/rtv/media/media_files/2025/05/02/AnOy8Amvimnca19Hi3Jg.jpg)
Veera Raghava Reddy
Veera Raghava Reddy : చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడిచేసిన రామరాజ్యం వీరరాఘవరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. దాడి తర్వాత అరెస్ట్ అయి బెయిల్ పై భయటకు వచ్చాడు రాఘవరెడ్డి. ప్రస్తుతం కండిషన్ బెయిల్‌పై ఉన్న రాఘవరెడ్డిపై ఈ రోజు దాడి జరిగింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేసి వస్తుండగా 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దాడిలో తనకు గాయాలైనట్లు చెబుతూ దాడిపై వీర రాఘవరెడ్డి మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు
రంగరాజన్‌పై దాడి కేసులో బెయిల్ పొందిన వీరరాఘవరెడ్డి రోజూ పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది కోర్ట్. దీంతో.. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తుండగా వీర రాఘవ రెడ్డిపై 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కర్రలతో దాడి చేయడంతో.. చేతులు, ముఖంపై గాయాలయ్యాయి. స్థానికులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుండగుల దాడిలో గాయపడ్డ వీరరాఘవను హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స తర్వాత.. మొయినాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు వీర రాఘవ రెడ్డి. కాగా తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.
Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?
కాగా రామరాజ్యాన్ని స్థాపిస్తానంటూ ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారు చేశాడు వీరరాఘవరెడ్డి. ఇతర ధర్మాలు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాయి అంటూ వీర రాఘవరెడ్డి ఆరోపిస్తున్నాడు. చట్టం, న్యాయవ్యవస్థ హిందూ ధర్మాన్ని రక్షించడం లేదంటూ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, యూట్యూబ్ వీడియోల ద్వారా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడమే కాకుండా ఆంధ్ర, తెలంగాణల్లోని దేవాలయాల పూజారుల వద్దకు వెళ్లి తన రామరాజ్యానికి ఆర్థిక మద్దతు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే చిలుకూరు ఆలయ పూజారి రంగరాజన్ తమకు సానుకూలంగా స్పందించడం లేదని ఆయనపై దాడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెను దుమారం చెలరేగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వీర రాఘవరెడ్డి కండీషన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా ఆయనపై దాడి జరగడంతో వీరరాఘవరెడ్డి మరోసారి వెలుగులోకి వచ్చాడు, ఆయనపై దాడి చేసింది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.
Also Read:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?