రంగరాజన్‌పై దాడి చేసింది ఇతనే.. రామరాజ్యం పేరుతో వీర రాఘవరెడ్డి వసూళ్ల దందా!
చిలుకూరు బాలాజీ గుడి ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడు రామరాజ్యం పేరుతో ఓ వెబ్ సైట్ ప్రారంభించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. ఫేమస్ కావాలనే ఉద్దేశ్యంతోనే దాడి చేసినట్లుగా ఒప్పుకున్నాడు.