/rtv/media/media_files/2025/08/26/telangana-assembly-2025-08-26-14-51-43.jpg)
Telangana Assembly
Telangana Assembly Session 2025: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరుగనున్నాయి. మూడు లేదా ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతకు ముందు రోజు 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాల మొదటి రోజు జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి అసెంబ్లీ సంతాపం ప్రకటించనుంది. దీనికి పార్టీలకు అతీతంగా అందరు హాజరై ఆయన మృతికి సంతాప సూచకంగా మొదటి రోజు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేయనున్నారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక జరుపనున్నారు. కాళేశ్వరంపై సీపీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక గురించి చర్చించనున్నట్లు తెలుస్తున్నది.
ప్రత్యేక సమావేశానికి సంబంధించి ఈ నెల 29న కేబినెట్ భేటీలో ఎజెండా ఖరారు కానుంది. బడ్జెట్ సమావేశాల తర్వాత శాసనసభను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. తాజాగా క్యాబినేట్ భేటి అయి గవర్నర్ కు ప్రోరోగ్ ఆదేశాలను రద్దు చేస్తూ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
కాగా ఈ సమావేశాలు వాడీ వేడిగా జరగనున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం నివేదిక పై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ర్టంలో వివాదస్పదంగా మారిన మార్వాడీ గోబ్యాక్ అంశాన్ని బీజేపీ శాసనసభలో లేవనెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో ప్రజల దృష్టిని మరల్చందుకే ఈ నినాదాన్ని కావాలనే ఆ పార్టీ క్రియేట్ చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి సురేఖ .. సమంత, కేటీఆర్ వ్యవహారాన్ని కావాలనే క్రియేట్ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని కమలం పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్.. బీజేపీ ఎంపీలు దొంగ ఓట్ల వల్లే గెలిచారని ఆరోపణల నేపథ్యంలో శాసనసభలో అధికార పార్టీని బీజేపీ ఇరుకున పెట్టే అవకాశాలున్నాయి. మరి ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అవకాశం ఇస్తుందా లేదా అనేది చూడాలి. కాళేశ్వరం అంశాన్ని కాంగ్రెస్ ప్రధానంగా చర్చించి బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడానికి మార్గం సుగమం చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తోంది.
అయితే ఈ అంశాన్ని బీఆర్‌ఎస్ కూడా సీరియస్ గానే తీసుకుంటోంది. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తుందని, దాన్ని అన్ని అసెంబ్లీ వేదికగా ఎదుర్కొవాలని బీఆర్‌ఎస్ ఉంది. మరో వైపు 42 శాతం బీసీ రిజర్వేషన్, ఎరువుల కొరత తదితర అంశాలపై కాంగ్రెస్ ను నిలదీసేందుకు బీఆర్‌ఎస్ రెడీ అయింది. ఈ క్రమంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి.
ఇది కూడా చదవండి:అయ్యోపాపం.. డబ్బుల కోసం రిటైర్డ్ డీఎస్పీని కట్టేసి కొట్టిన భార్యపిల్లలు..వీడియో వైరల్