/rtv/media/media_files/2025/10/01/train-accident-2025-10-01-13-26-00.jpg)
Train accident
వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తాండూరు రైల్వేస్టేషన్‌లో ఓ ఎస్సై రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో అక్కడున్న వారు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మార్పల్లికి చెందిన మారుతి (49) అనే వ్యక్తి కలబురగి జిల్లాలోని జేడీహల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సంచలనం.. హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్
అయితే మంగళవారం రాత్రి విధులకు వెళ్లేందుకు వికారాబాద్‌లోని తాండూరు రైల్వేస్టేషన్‌కు మారుతి వచ్చారు. రాత్రి 11 గంటలకు యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు కాలు జారడంతో కింద పడిపోయారు. ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి. దీంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. చివరికి అక్కడున్న రైల్వే సిబ్బంది ఆయన్ని వెంటనే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు మారుతి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.
Also Read: ఆ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్.. బలవంతంగా రిజైన్.. ఒక్కసారిగా 80 వేల మందిపై వేటు!
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కలబురగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూనే మారుతి బుధవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: మూతబడిన అమెరికా ప్రభుత్వం..నిధుల బిల్లులపై అంగీకారానికి రాని సెనేట్లు