BIG BREAKING: మూతబడిన అమెరికా ప్రభుత్వం..నిధుల బిల్లులపై అంగీకారానికి రాని సెనేట్లు

అనుకున్నట్టుగానే అమెరికా ప్రభుత్వం మూతబడింది. నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ల సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో షట్ డౌన్ లోకి ప్రవేశించింది.

New Update
us government

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు ఝామున 12.10 అమెరికా ప్రభుత్వం పాక్షిక షట్ డౌన్ లోకి ప్రవేశించింది. నిధుల బిల్లులపై రిపబ్లికన్, డెమోక్రాట్ సెనేట్లు ఒక అంగీకారానికి రాకపోవడంతో ప్రభుత్వాన్ని మూసివేసే పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత మొదటిసారిగా ఇది జరిగింది.  రిపబ్లికన్ల తరుఫు నుంచి 55 ఓట్లువచ్చినప్పటికీ అవి సరిపోలేదు. ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే  కనీసం 60 ఓట్లు రావాలి. దీంతో బిల్లులు వీగిపోయాయి. అలాగే డెమొక్రాట్లు ప్రతిపాదించిన మరో బిల్లు కూడా 47-53 తేడాతో ఓడిపోయింది.సాధారణ ప్రజల బీమా ప్రీమియంలు పెరగకుండా ఉండేందుకు ACA పన్ను క్రెడిట్‌ల గడువును పొడిగించాలని డెమొక్రాట్లు పట్టుబట్టారు. రిపబ్లికన్లు చేసిన మెడికేయిడ్ కోతలను కూడా వెనక్కి తీసుకోవాలన్నారు.ఈవిషయంలో ఇరువర్గాలు ఒక నిర్ణయానికి రాలేకపోయారు. దీంతో అమెరికా బడ్జెట్ క్లోజ్ అయింది. 

Advertisment
తాజా కథనాలు