/rtv/media/media_files/2025/08/21/telangana-police-jobs-2025-08-21-12-58-58.jpg)
Telangana Police
Crime rate : తెలంగాణలో క్రైమ్ రికార్డ్ గణనీయంగా పెరిగింది. హత్యలు, అత్యాచారాలు మాత్రమే కాదు. రోడ్డు ప్రమాదాలు, ఫోర్జరీ మోసాలు సైతం పెద్ద మొత్తంలో పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన నివేదికలో వెల్లడించింది. రాష్ర్టంలో నేరాలు, ఘోరాలు గతంతో పోలిస్తే పెరిగినట్లు బ్యూరో నివేదిక స్పష్టం చేసింది. దేశంలోని 16 ప్రధాన నగరాలతో పోలిస్తే రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌లో ఫోర్జరీ, ఛీటింగ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో ఫోర్జరీ, ఛీటింగ్ కేసులు 4,090 నమోదు కాగా, సుమారు 4,203 మంది బాధితులు ఈ కేసుల్లో మోసపోయినట్లు ఎఫ్ఐఆర్ లు తెలుపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2021-23లో 1,83,644 క్రిమినల్ కేసులు నమోదైనట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్తంగా జరిగిన నేరాల వార్షిక నివేదిక వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తన 71వ ఎడిషన్ లో వెల్లడించింది. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న నేరాల వివరాలను ఎన్‌సీఆర్‌బీ తన అధికారిక వెబ్‌సైట్https://ncrb.gov.in. లో అందుబాటులో ఉంచింది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. టాబ్లెట్‌లు వేసుకోలేదని తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన కూతురు
రోడ్డు ప్రమాదాలూ పెరిగాయి
కేవలం నేరాలు మాత్రమే కాక 2023లో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కూడా గణనీయంగా పెరిగాయి. రాష్ర్టంలో అత్యధికంగా 7,760 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా వాటిలో అత్యధికంగా 88.7శాతం మంది అతివేగంతోనే చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి లక్షమందిలో 35మంది కంటే ఎక్కువ మంది ప్రమాదాల్లో చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2022లో జరిగిన ప్రమాదాలు 7,559లు కాగా 23లో 7,760 ప్రమాదాలతో రోడ్డు ప్రమాద మరణాలు 1.33శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా 4,50,026 ప్రమాదాలు చోటు చేసుకోగా, ఈ ప్రమాదాల్లో రాష్ట్రంలో దాదాపు 5 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవించినట్లు నివేదిక వెల్లడించింది.
Also Read: నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో సంచలనం.. హైదరాబాద్‌లో పెరిగిన క్రైమ్
మహిళ కేసుల్లో 6 శాతం పెరుగుదల
2022 ఏడాదితో పోలిస్తే 2023లో తెలంగాణలో మహిళలపై నేరాలు ఆరు శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. రాష్ర్టంలో రికార్డు స్థాయిలో మహిళలపై 23,679 నేరాలు నమోదయ్యాయి. 2022లో 22,065 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మరో ఆరు శాతం కేసులు పెరిగాయి. అందులో ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలపై అధిక కేసులు నమోదు అయ్యాయి. మూడేళ్ల కాలంలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. 2021–23 మధ్యకాలంలో 25వేల కేసులు అత్యధికంగా నమోదయినట్లు తెలుస్తోంది. వాటిలో హింసాత్మక నేరాలు, సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల తదితర కేసులు ఉన్నాయి. ఇక అట్రాసిటీ కేసుల విషయంలో కొంత తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో సైబర్ నేరాలు బాగా పెరిగాయి. సుమారు 8వేల సైబర్ కేసులు అధికంగా నమోదయ్యాయి. ఆర్థిక నేరాలకు సంబంధించి ఆరు వేలకు పైగా కేసులు రికార్డయ్యాయి. అట్రాసిటీ కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ వాటిలో షెడ్యూల్ ట్రైబల్ అట్రాసిటీ పెరిగినట్లు నివేదిక తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: తమిళనాడులో దారుణం...ఆంధ్రయువతిపై ఖాకీ కామాంధుల అత్యాచారం