Revanth Reddy: నేనున్నంతకాలం..కేసీఆర్‌కు అధికారం దక్కనివ్వను.. సీఎం రేవంత్‌ రెడ్డి శపథం

తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్నిమళ్లీ అధికారంలోకి రానివ్వబోమని..సీఎం రేవంత్‌రెడ్డి శపథం చేశారు. ఒక్కసారి పాతాళంలోకి తొక్కితేనే ఇప్పటివరకు బయటకు రాలేదని..ఇక ముందు ఏం జరగుతుందో చూస్తూ ఉండండని వార్నింగ్ ఇచ్చారు.

New Update
cm revanth and kcr

As long as I am here, I will not let KCR come to power.

Revanth Reddy :  తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబాన్ని మళ్లీ అధికారంలోకి రానివ్వబోమని..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(cm revanth on sarpanch) శపథం చేశారు. ఒక్కసారి పాతాళంలోకి తొక్కితేనే ఇప్పటి వరకు బయటకు రాలేదని.. ఇక ముందు ఏం జరగుతుందో చూస్తూ ఉండండని వార్నింగ్ ఇచ్చారు.  నారాయణపేట జిల్లా కోస్గిలో ఏర్పాటు చేసిన నూతన సర్పంచ్‌ల సన్మాన సభలో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నువ్వెంత.. నీ స్థాయి ఎంత అంటూ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌ పై  నిప్పులు చెరిగారు. ‘‘రెండేళ్ల తర్వాత కేసీఆర్‌ బయటకు వచ్చి నా తోలు తీస్తానంటున్నారు. కేసీఆర్‌వి సోయిలేని మాటలు.. స్థాయిలేని విమర్శలు అంటూ ద్వజమెత్తారు. గతంలో నన్ను, నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. పగ సాధించడం మెదలుపెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వదిలిపెట్టానని రేవంత్‌ అన్నారు. నేను ప్రమాణం చేసినప్పుడే కూలబడ్డారు.. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేం ఉంటుంది. ఫాంహౌస్‌ను కేసీఆర్‌ బందీఖానాగా మార్చుకున్నారు. చుట్టూ పోలీసులున్నారు. చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు పంపినా అదే పరిస్థితి ఉంటుంది కదా. అంటూ రేవంత్‌ సంచలన వ్యాఖ్యాలు చేశారు. నన్ను గెలకవద్దు.. మర్యాదగా ఉండదని మాట్లాడటం లేదు. నల్లమల నుంచి వచ్చి జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ తర్వాత సీఎం అయ్యా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Also Read :  వ్యక్తి అనుమానాస్పద మృతి.. బోడమంచ తండాలో ఉద్రిక్తత

ప్రాజెక్టులు కాలేకానీ, ఆస్తులు వచ్చాయి.

ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి(cm-revanthreddy) అన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో పాలమూరును పూర్తిగా ఎండబెట్టారని ఆరోపించారు. కేసీఆర్ వలస వచ్చి పాలమూరు ఎంపీ అయ్యాడని.. ఆ తర్వాత సీఎం అయ్యారని, కానీ పాలమూరుకు నీళ్లు మాత్రం రాలేదన్నారు. వేసుకోవడానికి బట్టలు, తిరగడానికి చెప్పులు లేని వాళ్లు పదేళ్లలో రూ.వేల కోట్ల ఆస్తులు, ఫామ్‌హౌస్‌లు వచ్చాయని  రేవంత్‌ ప్రశ్నించారు. రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ నాలుగు మంచి మాటలు చెబుతారని అనుకున్నామని, మనిషి ఏం మారలేదని సెటైర్లు వేశారు. ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నో పాపాలు చేశారని, కానీ తాను ఎవరి మీద కేసులు పెట్టి వేధించలేదని తెలిపారు. ఎవరి పాపాన్ని వాళ్లే అనుభవిస్తారని సైలెంట్‌గా ఉన్నానని తెలిపారు. కానీ, కేసీఆర్ మా తోలు తీస్తానని అంటున్నారని.. మా తోలు తీయడం కాదు.. మా సర్పంచ్‌లే మీ తోలు వలుస్తారని, చింతమడకలో చీరి చింతకు వేలాడదీస్తారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

నీ అవ్వా.. లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డా 

కేసీఆర్ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా.. ఓ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే తీరు ఇలాగేనా అంటూ రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ను విమర్శించారు. తాను కూడా కింది స్థాయి నుంచి వచ్చానని.. మాట్లాడటం తనకు వచ్చని అన్నారు. కొడుకు కేటీఆర్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని గొడవ పెడుతుంటే.. తండ్రి మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. తానేమి అమాయకులను దుబాయ్ పంపుతానని మోసం చేయలేదని.. ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకుని బయటకు నెట్టిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. ఆమెకే సమాధానం చెప్పలేనోడు నాకు సవాలు విసరడం విడ్డూరంగా ఉందన్నారు. నీ అవ్వా.. లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డా అంటూ కేటీఆర్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో బాత్‌రూంలో కడిగినట్లు అనుకున్నావా.. నాతో మాట్లాడుడంటే అని రేవంత్ ఓ రేంజ్‌లో  రెచ్చిపోయారు.

Also Read :  29 నుంచి అసెంబ్లీ... కృష్ణా, గోదావరి జలాలపై వాడివేడిగా చర్చ

పాతాళంలోకి తొక్కితే..

2028లోనూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే 80 శాతానికిపైగా సీట్లతో అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పటికంటే రెండింతల మెజారిటీ ఖాయమని కామెంట్ చేశారు.  ఒక్కసారి పాతాళంలోకి తొక్కితేనే ఇప్పటి వరకు బయటకు రాలేదని.. ఇక ముందు ఏం జరగుతుందో చూస్తూ ఉండండని మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏం చేశారో అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పెడదామని అన్నారు. పార్టీ ఆఫీసులో మాట్లాడడు కాదు.. అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. నీళ్లు, నిధులు, నియామకాలు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ-కార్ రేసింగ్ సహా అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. డీలిమిటేషన్‌లో సీట్లు పెరిగితే 100కు పైగా గెలవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓడించామని.. పంచాయతీ ఎన్నికల్లో పాతరేశామని తేల్చి చెప్పారు.  భారత రాష్ట్ర సమితి, కేసీఆర్‌ చరిత్ర ఖతమే. మీ పార్టీకి, మీకు భవిష్యత్తు లేదు. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ గతమే.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌. గత చరిత్రతో ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు