మెరాకిల్.. తెగిన చేతిన అతికించిన వైద్యులు, రాష్ట్రంలో ఇదే తొలిసారి!

మంచిర్యాలకు చెందిన పవన్ కుమార్ కి బైక్ యాక్సిడెంట్ లో మోచేయి పైభాగం వరకు తెగిపడిపోయింది. దీంతో హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ వైద్యులు 8గంటలపాటు మైక్రోవ్యాసుకలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్స చేసి.. తెగిపడిన చేయిని పూర్తిగా అతికించారు.

apollo hospital doctors
New Update

రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చేయి పూర్తిగా తెగిపోయింది. వెంటనే అతడిని అపోలో హాస్పిటల్ కు తరలించగా.. వైద్యులు గంట సమయంలోనే ఆపరేషన్ ను విజయవంతం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : నాని - శ్రీకాంత్ ఓదెల మూవీకి డిఫరెంట్ టైటిల్.. అస్సలు ఉహించలేదే

మంచిర్యాలకు చెందిన పవన్ కుమార్ అక్టోబర్ 11న బైక్ పై వెళ్తుండగా జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి మోచేయి పై భాగం వరకు తెగి పడిపోయింది. వెంటనే తెగిన చేతితో పాటు పవన్ ను మంచిర్యాలలోని ఓ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. అయితే అక్కడ నుంచి మళ్లీ హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి రిఫర్ చేశారు. అప్పటికే గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన తొలి గంట) దాటిపోయింది. 

Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

అయినప్పటికీ అపోలో హాస్పిటల్ వైద్యులు దాదాపు 8 గంటలు శ్రమించి మైక్రోవ్యాసుకలర్ రీప్లాంటేషన్ శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. తెగిపడిన చేయిని పూర్తిగా అతికించడంలో విజయం సాధించారు. ఇలా చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. ఈ మేరకు అపోలో హాస్పిటల్ కన్సల్టెంట్ మైక్రో సర్జన్ డాక్టర్ జీఎన్ భండారి శస్త చికిత్స వివరాలను మీడియాతో పంచుకున్నారు. 

Also Read : సీఎం రేవంత్‌పై కేసు పెట్టాలని పిటిషన్!

తెగిన వెంటనే ఇలా చేయాలి..

ఎప్పుడైనా శరీర భాగాలు తెగిపడితే వాటిని అతికించే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని డాక్టర్ భండారి తెలిపారు. అందుకు సంబంధించి కొన్ని సూచనలు చేశారు. 

Also Read : ట్రేడింగ్ పేరుతో స్కాం.. హైదరాబాద్ ఐటీ ఉద్యోగికి రూ.2.29 కోట్ల టోకరా

తెగిపోయిన శరీర భాగాలను మొదట నీటితో కడగాలి. 
ఆ తర్వాత పాలిథీన్ కవర్ లేదా అల్యూమినియం కవర్ లో ఉంచాలి. 
ఆ కవర్ ను ఐస్ ప్యాక్ లో పెట్టి హాస్పిటల్ కు తీసుకు రావాలి. 
అలా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని డాక్టర్ భండారి పేర్కొన్నారు. 
అలా కాకుండా తెగిన అవయవాన్ని నేరుగా ఐస్ లో ఉంచితే అవయవం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. 
అప్పుడు తిరిగి అతికించడం సాధ్యం కాదు. 

#hyderabad #doctors #apollo-hospitals
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe