/rtv/media/media_files/2025/09/29/local-body-election-2025-09-29-15-27-45.jpg)
Local body Election
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 565 మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్షణం నుంచే రాష్ర్టంలో ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని ఎన్నికల ప్రధానాధికారి(chief-election-commisioner) రాణి కుముదిని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలతో పాటు 12,733గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read : సద్దుల బతుకమ్మ ఎప్పుడు? క్లారిటీగా చెప్పిన భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు!
Telangana Local Body Election 2025
మొదట ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ తర్వాత వార్డులు, సర్పంచ్ ఎన్నికలు(Local Body Election 2025) నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. అదెంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిజానికి ఈ నిబంధన చాలాకాలంగా ఉన్నప్పటికీ, ముగ్గురు పిల్లల నిబంధనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఎత్తివేశారు. ఏపీలో జనాభా తగ్గుతుందన్న కారణంగా ఆయన ఈ నిబంధనను సవరించారు. అయితే తెలంగాణలో మాత్రం ముగ్గురు పిల్లల నిబంధన అలాగే కొనసాగుతోంది. దీంతో ముగ్గురు పిల్లలుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకీ దిగాలనుకున్న పలువురు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఈ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేస్తుందో లేదోనని పోటీ చేయాలని ఆసక్తి ఉండి ముగ్గురు పిల్లలున్నవారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇది కూడా చూడండి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? వారికి నో ఛాన్స్..